Keerthy Suresh : కీర్తి సురేష్ లవ్ ఎఫైర్ పై స్పందించిన ఆమె తండ్రి.. అదే నిజం అంటూ..!
NQ Staff - May 28, 2023 / 09:53 AM IST

Keerthy Suresh : గత కొన్ని రోజులుగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ లవ్ ఎఫైర్ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె గురించి గతంలో కూడా ఇలాంటి వార్తలు చాలానే వచ్చాయి. అయితే రీసెంట్ గా ఆమె ఓ వ్యక్తితో ఫొటో దిగి ఇన్ స్టాలో పోస్టు చేసింది. ఇందులో వీరిద్దరూ ఒకే డ్రెస్ వేసుకున్నారు. పైగా ఇద్దరూ చాలా క్లోజ్ గా ఫోజులిచ్చారు.
దాంతో ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, అందుకే ఒకే రకం బట్టలు వేసుకున్నారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. అతనితోనే కీర్తి పెండ్లి అంటూ చాలా రకాల రూమర్లు వచ్చాయి. కాగా వీటిపై కీర్తి స్పందించింది. ఇలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదంటూ తెలిపింది. అతను తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ తెలిపింది.
అయితే ఇదే వార్తలపై తాజాగా కీర్తి తండ్రి సురేష్ కూడా స్పందించారు. ఈ మేరకు కేరళ బీజీపీ నాయకురాలు శోభ సురేంద్రన్ ఖాతాలో ఓ వీడియోను విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. రీసెంట్ గా మా అమ్మాయికి ఓ వ్యక్తితో ఎఫైర్ ఉందంటూ వార్తలు వస్తున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదు.
ఆ అబ్బాయి నాకు బాగా తెలుసు. అతను మా ఫ్యామిలీ ఫ్రెండ్. అతని పేరు ఫర్హాన్. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు. వీటివల్ల మా ఫ్యామిలీలో ప్రశాంతత కరువైంది అంటూ ఎమోషనల్ కామెంట్లు చేశాడు సురేష్. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.