ఐపీల్ నుండి తప్పుకున్న సురేష్ రైనా

Advertisement

కరోనా వైరస్ మహమ్మారి దాటికి మన దేశంలో జరగవలిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీల్) యూఏఈ దేశంలో నిర్వహించడానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇప్పటికే అన్ని జట్టులు యూఏఈ చేరుకున్నాయి. అయితే చెన్నై జట్టుకు మాత్రం ఒకదాని వెనుక ఒకటి సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే ఆ జట్టులో బౌలర్ దీపక్ చాహర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటె చెన్నై జట్టుకు మరో చిక్కు వచ్చి పడింది. అయితే సురేష్ రైనా ఐపిఎల్ నుంచి తప్పుకున్నాడు. ఇక ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

సురేష్ రైనా తన వ్యక్తిగత కారణాల వల్ల భారత్ కు తిరిగి వచ్చారని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సీఈఓ కెఎస్ విశ్వ నాథన్ తెలిపారు. అలాగే రైనా మిగిలిన ఐపిఎల్ సీజన్ లో అందుబాటులో ఉండరని వెల్లడించాడు. ఇక ఇలాంటి సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ రైనాకు, తన కుటుంబానికి పూర్తి మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. ఇక రైనా ఐపీల్ నుండి తప్పుకోవడంతో అభిమానులకు కాస్త నిరాశే అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here