రైనా మళ్ళీ ఐపీల్ ఆడే అవకాశం ఉందా!

Advertisement

ఈ ఐపీల్ సీజన్ ప్రారంభంలోనే చెన్నై సూపర్ కింగ్స్ కు ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కరోనా వల్ల ఒక ఆటగాడు, వ్యక్తిగత కారణాల వల్ల సురేష్ రైనా, హర్భజన్ సింగ్ ఐపీల్ నుండి తప్పుకున్నారు. ఇద్దరు బలమైన ఆటగాళ్లు టీం నుండి వెళ్లిపోవడంతో చెన్నై అభిమానులు నిరాశకు గురైయ్యారు. ఇప్పుడు సురేష్ రైనాపై టీమ్‌ఇండియా మాజీ కీపర్‌ దీప్‌దాస్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఐపీఎల్‌లో రైనా మళ్లీ ఆడతాడనే నమ్మకం నాకుందని, ఐపీఎల్‌ నియమాలు, క్వారంటైన్‌లో ఉండటం, కరోనా పరీక్షలు చేయించుకోవడం లాంటివాటితో మొదట్లో కొన్ని మ్యాచ్‌లు ఆడకపోవచ్చని, అయితే, తర్వాత మాత్రం ఆడతాడని పేర్కొన్నారు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్‌ అతడి స్థానాన్ని వేరే ఆటగాడితో భర్తీ చేయకపోయినా నేను ఆశ్చర్యపోనని పేర్కొన్నాడు. కొన్ని రోజుల క్రితం రైనా కూడా సోషల్ మీడియా ద్వారా తాను తిరిగి వచ్చే అవకాశముందని చెప్పిన విషయం తెలిసిందే. రైనా ఐపీల్ లో ఆడుతాడో లేదో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here