12.5 కోట్ల రూపాయలు వదిలి ఎవరైనా తిరిగి వస్తారా.. : సురేష్ రైనా

Advertisement

ఐపీల్ లో చెన్నై టీమ్ నుండి కొన్ని కారణాల వల్ల తాను తప్పుకున్నట్లు సురేష్ రైనా ప్రకటించారు. అయితే రైనా తప్పుకున్న తరువాత అనేక ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే యూఏఈలో తనకు కల్పించిన సదుపాయాలు నచ్చక రైనా ఇండియాకు తిరిగొచ్చాడని కొందరు అంటున్నారు. అలాగే చెన్నై టీం తరపున రైనా ఇక ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

ఈ తరుణంలో తాను ఈ ఏడాది ఐపీఎల్ ఆడకపోవడం పై సురేష్ రైనా స్పష్టతను వెల్లడించాడు. అయితే తన కుటుంబ సమస్య కారణంగా నా వ్యక్తి గతంగా తిరిగి వచ్చానని అన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తనకు ఒక కుటుంబం అని తెలిపాడు. చెన్నై జట్టుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసాడు. అయినా బలమైన కారణం ఏదీ లేకుండా 12.5 కోట్ల రూపాయలను వదులుకుని ఎవరూ తిరిగిరారని రైనా వెల్లడించాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here