Surekha vani : టీఆర్పీలే కావాలి కదా?.. మీడియాపై సురేఖా వాణి కూతురి సెటైర్స్

Surekha vani :సురేఖా వాణి కూతురు సుప్రిత గురించి అందరికీ తెలిసిందే. తెరపై కనిపించే సురేఖా వాణికి సోషల్ మీడియాలో తన కూతురు సుప్రితతో కలిసి సందడి చేసే సురేఖా వాణికి ఎంతో తేడా ఉంటుంది. కూతురిని ఎప్పుడూ లైమ్ లైట్‌లో ఉంచేందుకు తెర ఆరాట పడుతూ ఉంటుంది. కూతురిని హీరోయిన్‌గా చేయాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉంటోంది. అందుకే ఇలా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేలా చేస్తోంది.

ఇప్పుడు సుప్రిత అంటే తెలియని నెటిజన్ ఎవ్వరూ ఉండరు. ఆమె చేసే రచ్చ.. వీకెండ్ అయితే చాలు ఇద్దరూ కలిసి తిరిగే పబ్‌లు, చేసుకునే పార్టీల గురించి నెటిజన్లందరికీ తెలిసిందే. అయితే మధ్య మధ్యలో సుప్రిత మీడియా మీద సెటైర్లు వేస్తుంటుంది. ఈ వారంలోనే సుప్రిత మీడియా మీద మండిపడింది.

Surekha vani daughter Supritha Satire On media 
Surekha vani daughter Supritha Satire On media

తన తల్లికి రెండో పెళ్లి అంటూ వచ్చిన వార్తలపై సుప్రిత సెటైర్లు వేసింది. అసలు జర్నలిస్ట్‌లే కాదు.. అవి న్యూస్ చానెల్స్ కావంటూ.. ఉన్నవి రాయండి.. కొత్తవి క్రియేట్ చేయకండి అంటూ ఓ రేంజ్‌లో సుప్రిత చిందులు తొక్కింది. తాజాగా ఇప్పుడు కూడా అలానే మీడియా మీద పంచ్‌లు వేసింది. ఎక్కడో ఏదో కాలిపోయిందంటూ అయినా మీడియా పట్టించుకోవడం లేదంటూ వచ్చిన ఓ మీమ్ మీద సుప్రిత కౌంటర్ వేసింది.

Surekha vani : మీడియాపై సురేఖా వాణి కూతురి సెటైర్స్

అలాంటి ప్రమాదాల మీద మీడియా స్పందించనే స్పందించిదన్నట్టుగా సుప్రిత మాట్లాడుకొచ్చింది. ఇవన్నీ మాకెందుకు ఎక్కడ ఎవరు దొరికారు.. వాడు ఇలా.. వీడు ఇలా.. కావాలని నాకు టీఆర్పీ ఎక్కువ కదా అని కౌంటర్లు వేసింది. మొత్తానికి తనకు మీడియా మీదున్న కోపాన్నంత ఇలా బయటపెట్టేసింది.

Advertisement
Advertisement