Surekha Vani: ఏంటో ఈ పిచ్చి వేషాలు అంటూ కూతురి ప్ర‌వ‌ర్త‌న‌ పై సురేఖా వాణి కామెంట్

Surekha Vani ఒకప్పుడు సైడ్ క్యారెక్ట‌ర్స్ వేసి ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని అల‌రించిన సురేఖా వాణి ఇప్పుడు యూత్‌ని ఆకర్షించే ప్ర‌య‌త్నం చేస్తుంది. ముఖ్యంగా ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు. త‌న కూతురితో క‌లిసి డ్యాన్స్‌లు చేస్తూ అందుకు సంబంధించిన వీడియోల‌ను సామాజిక మాధ్య‌మాల‌లో షేర్ చేస్తుంది. ఇవి నెటిజన్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి.

ఈ మ‌ధ్య కాలంలో సురేఖావాణి సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అప్పుడ‌ప్పుడు నెటిజ‌న్స్‌తో ముచ్చ‌టిస్తూ ఉంటుంది. వారు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానాలు ఇస్తూ వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. రీసెంట్‌గా సురేఖా వాణి ఓ టాక్ షోకి హాజ‌రుకాగా, అందులో త‌న కెరీర్, భ‌ర్త మ‌ర‌ణించిన విష‌యాల‌పై చెప్పి ఎమోష‌న‌ల్ అయింది. తన కెరీర్‌ ప్రారంభమై 22 ఏళ్లు పైగా అవుతుందని పేర్కొన్న ఆమె సీటీ కేబుల్‌లో కెరీర్‌ స్టార్ట్ అయ్యిందని అక్కడ తన బాబాయ్ పని చేస్తూ ఉండడంతో ఆయన ప్రోద్బలంతో ఎంట్రీ ఇచ్చి చిన్న చిన్న ప్రోగ్రామ్స్, ఇంటర్వ్యూలు చేస్తూ ఇక్కడి దాకా వచ్చానని ఆమె చెప్పుకొచ్చింది.

Surekha Vani

సురేఖా వాణి రెండో పెళ్లిపై కూడా కొన్నాళ్లుగా జోరుగా ప్ర‌చారాలు న‌డుస్తుండ‌గా, వాటిని ఖండించింది. అయితే ఇటీవ‌లి కాలంలో సినిమా ఆఫర్స్ పెద్ద‌గా రాక‌పోవ‌డంతో కూతురు సుప్రిత‌తో సురేఖా వాణి తెగ సంద‌డి చేస్తుంది. వెరైటీ వెరైటీ గెటప్పులు, స్టెప్పులతో రచ్చ చేయ‌డ‌మే కాక అందాల ఆర‌బోత‌తో నెటిజ‌న్స్‌కు ముచ్చెమ‌టలు ప‌ట్టిస్తున్నారు. వీరిద్ద‌రిని చూస్తుంటే అక్కా చెల్లెళ్లులా అనిపిస్తుందే త‌ప్ప‌, త‌ల్లి కూతుళ్లు అని అనిపించ‌డం లేదంటూ ప‌లువురు నెటిజ‌న్స్ చెప్పుకొచ్చారు.

సురేఖా వాణి సోష‌ల్ మీడియాలో ఎంత ఫేమ‌స్ అయిందో, దాని వ‌ల‌న అంతే ట్రోలింగ్ ఎదుర్కొంటుంది. ఆ మధ్య తమ పెంపుడు కుక్కకు బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేయడంతో తీవ్రంగా ట్రోలింగ్ జరిగింది. ఇద్ద‌రికి ప‌ని పాట లేక ఇలాంటి పిచ్చి ప‌నులు చేస్తున్నార‌ని నెటిజ‌న్స్ మండి ప‌డ్డారు. తాజాగా సురేఖావాణి త‌న కూతురిపైకౌంట‌ర్ వేసింది. పెట్‌తో ముద్దుముచ్చ‌ట ఆడుతుండ‌డంతో ఏంటో ఈ పిచ్చి వేశాలు అని సురేఖా త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై నెటిజ‌న్స్ ఆ వేశాలు మీ ఇద్ద‌రికే తెలియాలి అని కామెంట్స్ పెడుతున్నారు.