Konda Surekha: ప్రేమించి పెళ్లి చేసుకున్నాన‌న్న కొండా.. ఎర్ర‌బెల్లి ఎంత‌మంది తండ్రుల‌కు పుట్టాడోనంటూ సంచ‌ల‌న కామెంట్స్

Konda Surekha: సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ కొండా షూటింగును వరంగల్ వేదికగా ప్రారంభించారు. కొండ మురళి, కొండా సురేఖ జీవిత చరిత్రపై కొండా సినిమాను తెరకెక్కిస్తున్న రాంగోపాల్ వర్మ వరంగల్ నగరంలో సందడి చేశారు. కొండా సురేఖ ఇంటికి వెళ్ళిన రాంగోపాల్ వర్మకు సురేఖ హారతి పట్టి, దిష్టి తీసి మరీ స్వాగతం పలికారు. కొండా చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా కొండా సురేఖ అనుచరులతో వరంగల్లో రామ్ గోపాల్ వర్మ ర్యాలీ చేశారు.

Surekha Konda Shares Her Lover Story
Surekha Konda Shares Her Lover Story

ర్యాలీలోభాగంగా సురేఖ మాట్లాడుతూ.. వయసులో ఉన్నవారు ప్రేమించుకోవడం తప్పు కాదని, కానీ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటేనే వారి జీవితాలు ఎంతో బాగుంటాయని, అందుకు తమ జంటే నిదర్శనమని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. తన భర్తను అంతం చేసేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎప్పట్నుంచో కుట్రలు పన్నుతున్నారని, అందుకోసమే ఆయన టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారని సురేఖ ఆరోపించారు.

గతంలో టీడీపీలో చేరాలని తమను చంద్రబాబు ఆహ్వానించారని, అయితే ఆ పార్టీలో ఎర్రబెల్లి ఉండటంతో తాము చేరలేదని తెలిపారు. తాము టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాతే ఎర్రబెల్లి కూడా ఆ పార్టీలో చేరి నీతిమాలిన రాజకీయాలు చేశారని మండిపడ్డారు. తాను ఒక తండ్రికే పుట్టానని టీడీపీని వదిలిపెట్టబోనని ఎర్రబెల్లి నాడు శపథాలు చేశారని, మరి టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన ఎంతమంది తండ్రులకు పుట్టారో సమాధానం చెప్పాలంటూ సురేఖ ఘాటుగా వ్యాఖ్యానించారు.

రాజకీయాల్లో గాడ్‌ఫాదర్‌ లేకుండా ఎదిగి ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కొండా మురళి అని కొనియాడారు.‘మహా దమ్మున్న మగాడు కొండా మురళీధర్‌ రావు. సురేఖ వెంట ఆయన పడినట్లుగా.. కొండా బయోపిక్‌ తీయడానికి తాను ఆయన వెంట చాలా తిరగాల్సి వచ్చింది’ అన్నారు. సినిమా కొండా మురళికి పాజిటివ్‌గా ఉంటుందా లేక నెగెటివ్‌గా ఉంటుందా అని చాలా మంది పెద్దలు తనను అడిగారని, ‘సినిమాలో నిజాన్ని మీ ముందు ఉంచుతా మీరే పాజిటివో నెగెటివో చెప్పాలి’ అని వ‌ర్మ పేర్కొన్నాడు.