విద్యార్థులు పరీక్షలు రాయాల్సిందే : సుప్రీం కోర్ట్

Advertisement

కరోనా దాటికి విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసింది ప్రభుత్వం. అయితే తాజాగా ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహణ పై సుప్రీం కోర్టు కీలక తీర్పు ప్రకటించింది. ముందు సంవత్సరాల విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసినా, ఫైనల్ ఇయర్ వారికి పరీక్షలు నిర్వహించాలన్న యూజీసీ నిర్ణయాన్ని సుప్రీం సమర్థించింది. ఇప్పటికే కాలేజీ, యూనివర్సిటీల ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని యూజీసీ నిర్ణయం తీసుకుంది.

ఇక ఈ పరీక్షలను సెప్టెంబర్ 30వ తేదీ లోపే నిర్వహించాలని యూజీసీ సన్నాహాలు సిద్ధం చేసింది. ఇక చివరకు కోర్టు కూడా అదే విషయాన్నీ సూచించింది. ఇక సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు మేరకు ఫైనల్ ఇయర్ విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాల్సిందే. ఒకవైపు పరీక్షలు లేకుండానే డిగ్రీ పట్టా చేతికి వస్తుందని భావించిన విద్యార్థులందరికీ నిరాశే కలిగిందని చెప్పాలి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here