విజయ మాల్యా దోషని వెల్లడించిన సుప్రీం

Advertisement

బ్యాంక్ దగ్గర రుణాలు తీసుకొని తిరిగి కట్టకుండా లండన్ లో దాక్కున్న విజయ మాల్యాకు సుప్రీం కోర్ట్ లో ఎదురుదెబ్బ తగిలింది. 2017లో కోర్ట్ ధిక్కరణ కేసు విజయ మాల్యపై నమోదు అయ్యింది. అయితే కేసులో విజయ మాల్యను అప్పుడే కోర్ట్ దోషిగా వెల్లడించింది. అయితే కోర్టు ధిక్కరణ కేసులో తనను దోషిగా తేలుస్తూ 2017లో ఇచ్చిన తీర్పును మరోసారి పరిశీలించాలని విజయ మాల్యా సుప్రీంను కోరారు.

మాల్యా దాఖలు చేసిన పునఃసమీక్ష పిటిషన్‌ను న్యాయమూర్తులు యు.యు. లలిత్‌, అశోక్‌ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ కేసులో తీర్పును ఆగస్టు 27న తీర్పు రిజర్వు చేసిన సుప్రీంకోర్టు బెంచి, నేడు వెలువరించిన తీర్పులో విజయ్‌ మాల్యా దోషే అని మరోసారి స్పష్టం చేసింది. మాల్యా తన పై ఎగవేత ఆరోపణలు ఉన్న నేపథ్యంలో తన వారసులకు రూ. 900కోట్లు బదిలీ చేయడంతో అతనిని 2017లో కోర్ట్ ధిక్కరణ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here