Advertisement
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏ ముహూర్తాన సుప్రీం కోర్టు జడ్జికి లేఖ రాశారో కానీ… అప్పటి నుంచి సీఎం జగన్ కు చిక్కులు ఎక్కువయ్యాయి తప్పితే తగ్గలేదు. మొత్తం న్యాయవాదులంతా సీఎం జగన్ పై కేసులు పెట్టారు. అసలు ఆయన సీఎం పదవికే అర్హుడు కాదు అన్నట్టుగా మాట్లాడారు. ఆ లేఖ నిజానికి పెద్ద దుమారమే లేపింది. ఓకే.. కానీ.. సీఎం జగన్ ను కావాలని ఇక్కడ అంతా కార్నర్ చేసినట్టుగా కనిపిస్తోంది.
సుప్రీం కోర్టు న్యాయవాదులు సుప్రీం కోర్టులో జగన్ పై కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ దాఖలు చేశారు. వాటిపై విచారణ ప్రారంభించిన సుప్రీం.. ఇప్పటికే లేఖ బహిర్గతం చేశాక ఇంకా విచారణ చేయాల్సిన అవసరం ఏంటి? అంటు ప్రశ్నించింది.
ఈ పిటిషన్లను జస్టిస్ సంజయ్ కౌల్, దినేష్ మహేశ్వరి, రిషికేశ్ రాయ్ ధర్మాసనం విచారించింది. అసలు.. ఈ పిటిషన్లు అన్నీ గందరగోళంగా ఉన్నాయని జస్టిస్ కౌల్ పేర్కొన్నారు.
సీఎం జగన్ కు వ్యతిరేకంగా.. సుప్రీం కోర్టు న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ వేసిన పిటిషన్ ను సుప్రీం కొట్టేసింది. జగన్ పై ఆరోపణలకు సంబంధించిన పిటిషన్లు ఇప్పటికే వేరే ధర్మాసనంలో ఉన్నాయని.. మళ్లీ ఈ పిటిషన్లు ఎందుకంటూ జస్టిస్ కౌల్ వాటిని కొట్టేయడంతో.. సీఎం జగన్ కు కాస్త ఊరటనిచ్చిన అంశం అది. కాకపోతే మరో సుప్రీం న్యాయవాది సునీల్ కుమార్ సింగ్ వేసిన పిటిషన్ ను మాత్రం సుప్రీం స్వీకరించింది.