సుశాంత్ మృతి పై సీబీఐ ఎంక్వైరీకి అనుమతి ఇచ్చిన సుప్రీం

Advertisement

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ 14 న తన అపార్ట్ మెంట్ లో ఉరి వేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అయితే సుశాంత్ మృతిపై ఇప్పటికే రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. సుశాంత్ మృతికి బాలీవుడ్ బడా నిర్మాతలు, దర్శకులే కారణమని నటి కంగనా రనౌత్ మొదటి నుండి ఆరోపణలు చేస్తున్నారు. అలాగే తన కొడుకు మృతికి రీయా కారణమని, తన కొడుకు డబ్బులు రూ. 15 కోట్లు కూడా రీయా తీసుకుందని సుశాంత్ తండ్రి పాట్నాలో కేసు నమోదు చేశారు. అలాగే సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని బీహార్ గవర్నమెంట్ కూడా మొదటి నుండి ప్రయత్నాలు చేస్తుంది.

ఈ కేసుపై ఇవ్వాళ విచారణ జరిపిన సుప్రీం కోర్ట్ సీబీఐ ఎంక్వైరీకి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో సీబీఐ ఎంక్వైరీకి కేంద్రం కూడా ఒప్పుకున్న విషయం తెలిసిందే. సీబీఐకు ఈ కేసును అప్పగించడంపై సుశాంత్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుండి సీబీఐ విచారణ జరపాలని సోషల్ మీడియాలో సుశాంత్ అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here