ప్రశాంత్ భూషణ్ కు ఒక్క రూపాయి జరిమానా విధించిన సుప్రీం కోర్ట్
Admin - August 31, 2020 / 10:59 AM IST

సుప్రీం కోర్ట్ జడ్జ్ లు, కోర్ట్ ల పై వివాదాస్పదమైన ట్వీట్స్ చేసిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పై సుమోటగా కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రశాంత్ భూషణ్ ను దోషిగా తెలుస్తూ ఈనెల 14న సుప్రీం కోర్ట్ తీర్పును వెల్లడించింది. అయితే కోర్ట్ లకు క్షమాపణ చెప్పాలని ప్రశాంత్ కు సుప్రీం రెండు వారాల సమయం ఇచ్చింది. కానీ ప్రశాంత్ క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో ఆగస్టు 25న తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు, నేడు శిక్ష ఖరారు చేసింది.
ప్రశాంత్ భూషణ్కు ఒక్క రూపాయి జరిమానా విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. సెప్టెంబర్ 15లోగా రూపాయిని కోర్టుకు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. డిపాజిట్ చేయకపోతే 3 నెలల జైలుశిక్ష , మూడేళ్లపాటు ప్రాక్టీస్ చేయకుండా నిషేధం విధిస్తామని తీర్పులో హెచ్చరించింది. మరి ప్రశాంత్ భూషణ్ ఒక్క రూపాయి జరిమానా చెల్లిస్తాడో లేదో వేచి చూడాలి.