Supreme Court Adjourned On Kavitha Petition : కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ ఈనెల 26కు వాయిదా..!
NQ Staff - September 15, 2023 / 02:10 PM IST
Supreme Court Adjourned On Kavitha Petition :
కవిత పిటిషన్ మీద విచారణను ఈ నెల 26కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈడీ నోటీసుల మీద మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు కవిత. ఈడీ విచారణ సరిగ్గా లేదని తప్పుబడుతూ గతంలో కవిత పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ లో లిక్కర్ కేసులో తనకు ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని కవిత కోరారు.
తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కవిత పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నేడు విచారణకు వచ్చిన ఈ కేసులో కవితకు షాక్ తగిలింది. కేసును వాయిదా వేసింది కోర్టు. అయితే కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేస్తే తప్పనిసరిగా హాజరు కావాలా.. అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. సుప్రీంలో విచారణలో ఉండగానే ఈడీ గురువారం మరోసారి నోటీసులు జారీ చేయడంతో ఈడీ అధికారులను సవాల్ చేస్తూ సుప్రీంలో కవిత పిటిషన్ వేశారు.
ఇక కేసు వాదనలో భాగంగా కవిత విచారణకు రావాల్సిందేనని ఈడీ వాదించింది. ఈ రోజు విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కవిత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. కానీ కవిత ఏ విషయం అయినా సరే లాయర్లతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.