పెళ్లి పీటలు ఎక్కవలసిన వరుడు కరోనతో మృతి
Admin - August 6, 2020 / 12:23 PM IST

కరోనా కల్లోలం సృష్టిస్తుంది. పట్టణాలు, పల్లెలు అని తేడా లేకుండా అన్ని చోట్ల విస్తరిస్తుంది. అయితే ఈ మహమ్మారి పెళ్లి జరగవలసిన ఓ ఇంట్లో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే ఏపీ లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఓ యువకుడు కరోనా సోకి చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. అయితే బుధవారం ఆ యువకుడు పెళ్లిపీటలు ఎక్కావాల్సిన లోపే మరణించారు. ఆదోనిలోని 11వ వార్డుకు చెందిన 28 సంవత్సరాల వయస్సు గల యువకుడు గత నెల 28న తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. దీనితో స్థానికంగా ఉన్న ఏఎన్‌ఎంను సంప్రదించారు. ఆమె అతని కరోనా పరీక్షలకు నమూనాలు సేకరించారు.
యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. అయితే ఇటీవలే యువకుడికి పెళ్లి కుదిరింది. దీనితో బుధవారం పెళ్లిచేయాలని పెద్దలు ముహూర్తం నిశ్చయించారు. మృతి చెందిన యువకుడికి తల్లిదండ్రులు, చెల్లెలు ఉన్నారు. అయితే తన తల్లి పక్షవాతం వ్యాధితో బాధపడుతూ లేవలేని స్థితిలో ఉంది. అలాగే తన తండ్రి వయసు మీద పడడంతో పని చేయని పరిస్థితి దీనితో ఇంటికే పరిమితం అయ్యాడు. పెళ్లిపీటలు ఎక్కావాల్సిన ఆ యువకుడు మరణించడంతో ఆ కుటుంబం మొత్తం కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయింది.