Superstar Rajinikanth : ఆ రోజుల్లోనే రజినీకాంత్ కెరీర్ ను నిలబెట్టే సాయం చేసిన శరత్ బాబు..!
NQ Staff - May 24, 2023 / 10:30 AM IST

Superstar Rajinikanth : సీనియర్ నటుడు శరత్ బాబు రెండు రోజుల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్తతో సౌత్ ఇండస్ట్రీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో ఆయన నటించారు. దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించిన ఆయన.. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.
ఆయన కెరీర్ మొదట్లో హీరోగా కూడా చేశారు. కానీ హీరోగా కంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ఎక్కువ పేరు తెచ్చుకున్నారు. కాగా కొంత కాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన.. నెలరోజులుగా ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. కానీ కోలుకోలేక చివరకు మరణించారు. ఆయన భౌతిక కాయాన్ని నిన్న చెన్నైకు తరలించారు.
ఈ సందర్భంగా ఆయనకు నివాళి అర్పించిన రజినీకాంత్.. శరత్ బాబుతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. మేమిద్దరం చాలా మంచి స్నేహితులం. ఎన్నో ఏండ్లుగా మా ఇద్దరి మధ్య స్నేహబంధం ఉంది. నేను అప్పట్లో సిగరెట్ ఎక్కువగా తాగేవాడిని. దాంతో శరత్ చాలా సీరియస్ అయ్యేవాడు.
నా నోట్లో సిగరెట్ కనిపిస్తే తీసి అవతల పడేసేవాడు. నటించడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో నా వెన్ను తట్టి ప్రోత్సహించాడు. ఆయన చేసిన సాయం వల్లే నేను మంచి స్థాయికి చేరుకున్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు రజినీకాంత్. ఒక గొప్ప స్నేహితుడిని కోల్పోవడం బాధగా ఉందంటూ తెలిపాడు రజినీ.