ఇండియా రికార్డు బద్దలుకొట్టిన మహేష్ ఫ్యాన్స్ వరల్డ్ రికార్డు దిశగా ……

Admin - August 9, 2020 / 08:08 AM IST

ఇండియా రికార్డు బద్దలుకొట్టిన మహేష్ ఫ్యాన్స్  వరల్డ్ రికార్డు దిశగా ……

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడున్న హీరోస్ లలో ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అట్రాక్ట్ చేయగలిగిన నటుడు మహేష్ బాబు. కేవలం తన మొహంపై కెమెరా పెట్టినా కూడా తన యాక్టింగ్ తో ప్రేక్షకులను రెండున్నర గంటలు థియేటర్ లో కూర్చోపెట్టగల ఎక్స్ ట్రాడినరీ మరియు కంప్లీట్ యాక్టర్ మహేష్. మహేష్ కు ఇప్పుడున్న క్రేజ్ కు కృష్ణ కూడా కారణమని ఎంతో మంది చెప్తుంటారు,చాలా సార్లు మహేష్ కూడా చెప్పారు. అయితే మహేష్ లాంటి ఇంటెన్స్ నటుడు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చినా కూడా ఇంతే స్థాయికి చేరేవాడని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. మహేష్ యాక్టింగ్ లో ఉన్న పర్ఫెక్షన్ వల్ల తన పక్కన చేస్తున్న నటులు అభద్రతా భావంతో ఉండటాన్ని ఎన్నోసార్లు చేస్తుంటాం.

మహేష్ బర్త్ డే కారణంగా ఆయన అభిమానులు ట్విట్టర్ లో రచ్చ లేపుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సంధర్బంగా ఆయన అభిమానులు ట్విట్టర్ లో క్రియేట్ చేసిన రికార్డ్ ను కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ అభిమానులు బ్రేక్ చేశారు. పవన్ కళ్యాణ్ ను అభిమానులు క్రియేట్ చేసిన రికార్డ్ ను మహేష్ బర్త్ డే కామన్ డీపీ రిలీజ్ రోజున 24 గంటల్లో 3.1 కోట్ల ట్వీట్స్ తో జాతీయ రికార్డ్ సెట్ చేశారు. అయితే ఇప్పుడు మహేష్ బర్త్ డే సంధర్బంగా కూడా మహేష్ అభిమానులు రికార్డ్ సెట్ చేస్తున్నారు. నిన్న సాయంత్రం మొదలైన ఈ ట్రెండ్ 9 మినిట్స్ లో 1 మిలియన్ ట్వీట్స్, 20 నిమిషాల్లో 2 మిలియన్ ట్వీట్స్, గంటన్నరలో 9 మిలియన్ ట్వీట్స్ తో కొత్త రికార్డ్ ను సృష్టించారు. ఇవ్వాళ సాయంత్రం వరకు 3.5 కోట్ల ట్వీట్స్ రానున్నాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇండియాలోనే తక్కువ సమయంలో 1 మిలియన్ ట్వీట్స్ సాధించిన హీరోగా మహేష్ నిలిచారు. ట్వీటర్ రికార్డ్స్ క్రియేట్ చేయడంలో మహేష్ అభిమానులు ముందున్నారు.

మహేష్ బాబు ఈ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం ఆపేసి, మహేష్ యాక్టింగ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిన ఒక్కడు, పోకిరి, బిజినెస్ మెన్, 1 నేనొక్కడినే లాంటి ఔట్ ఆఫ్ ద బాక్స్ కంటెంట్ తో మళ్ళీ ప్రేక్షకులకు మెంటల్ ఎక్కించాలని కోరుకుంటున్నాము.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us