Krishna : నేడు సూపర్‌స్టార్‌ కృష్ణ పెద్ద కర్మ

NQ Staff - November 27, 2022 / 11:21 AM IST

Krishna : నేడు సూపర్‌స్టార్‌ కృష్ణ పెద్ద కర్మ

Krishna : టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మృతి విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇండస్ట్రీ వర్గాల వారు కూడా కృష్ణ యొక్క మృతి దుఃఖం లోనే ఉన్నారు.

తెలుగు సినిమా పరిశ్రమ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉంది అంటే కచ్చితంగా అది సూపర్ స్టార్ కృష్ణ యొక్క ప్రయోగాల పుణ్యమే అంటూ చాలా మంది ఒప్పుకుంటారు.. ఒప్పుకోవాల్సిన విషయం కూడా అది.

అలాంటి సూపర్స్టార్ కృష్ణ మృతి చెందాడు అంటే ఆయన అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనను మరో సారి గుర్తు చేసుకోవడానికి కుటుంబ సభ్యులు పెద్ద కర్మను నిర్వహిస్తున్నారు.

నేడు ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ఈ పెద్ద కర్మ కి హాజరు కాబోతున్నారు. అంతే కాకుండా కృష్ణ అభిమానులు తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా ఇతర రాష్ట్రాలు మరియు దేశాల నుండి కూడా హాజరు కాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు స్థాయికి తగ్గట్లుగానే ఈ పెద్దకర్మ నిర్వహిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. కృష్ణ యొక్క జ్ఞాపకార్థం ప్రత్యేకంగా ఉండాలని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారట.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us