చంద్రబాబు మీద పాత పగ తీర్చుకునే టైమ్ వచ్చింది.. వెయిట్ తమ్మినేనికి గుడ్ ఛాన్స్

Chandrababu naidu
Chandrababu naidu

ఏపీ శాసన సభ సమావేశాల్లో భాగంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సభలో అధికార, ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. సభలో ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా విపక్ష టీడీపీ అడ్డుకుంటోందని అధికార పక్షం ఆరోపిస్తుంటే.. ప్రజా సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని టీడీపీ నానా రాద్ధాంతం చేస్తోంది. శాసన సభ సమావేశాల్లో టీడీపీ ప్రవర్తన సరిగా లేదని.. పదే పదే సభలో చర్చకు అడ్డు తగులుతోందని వైసీపీ సభ్యులు శాసనసభాపతికి ఫిర్యాదు చేశారు.
దీంతో ప్రతిపక్షనేత చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని.. పరిశీలించిన స్పీకర్ తమ్మినేని సీతారాం విపక్ష సభ్యులపై చర్యలు చేపట్టారు. అంతేకాకుండా టీడీపీ సభ్యులు పోడియం ముందు బైఠాయించడంపై తీవ్రంగా పరిగణిస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని చెప్పారు. రాజ్యాంగ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని.. ప్రతిపక్ష నేత అయోమయంలో పడ్డారని స్పీకర్ అన్నారు.

Chandrababu naidu
Chandrababu naidu

గతంలో టీడీపీ అవలంభించిన విధానాలను సభలో వైసీపీ ఎండగట్టింది. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ చేస్తున్న ఆరోపణలు అసత్యాలని వైసీపీ సభ్యులు ఆరోపించారు. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ అన్నదాతలను పట్టించుకోకుండా ఇప్పుడు పోరాటం చేస్తున్నట్లు నటిస్తున్నారని వైసీపీ సభ్యులు ఆరోపించారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని అయినా ప్రతిపక్షం రాజకీయం చేస్తోందని అన్నారు.

చంద్రబాబు సస్పెండ్

దీంతో సభలో టీడీపీ సభ్యుల గందరగోళం ఎక్కువవడంతో స్పీకర్ సభను ఎంత కంట్రోల్ పెట్టాలని చూసినా విపక్ష సభ్యుల వినలేదు. పైగా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి బైఠాయించి నినాదాలు చేయడంతో చర్చకు ఆటంకం ఏర్పడింది. దీంతో సభా సజావుగా జరగడానికి శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన చేసిన తీర్మానాన్ని అధికార పక్ష సభ్యులు ఆమోదించడంతో చంద్రబాబుతో సహా టీడీపీ సభ్యులను ఒక రోజు సస్పెండ్ చేశారు స్పీకర్. ఈ లెక్కన తమ్మినేని సీతారాం కి చంద్ర బాబు పై తన పాత పగను తీసుకునే అవకాశం వచ్చింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here