Sunny Leone : నేను పోర్న్ వీడియోలు మానేయడానికి ఇండియానే కారణంః సన్నీలియోన్

NQ Staff - May 27, 2023 / 12:20 PM IST

Sunny Leone : నేను పోర్న్ వీడియోలు మానేయడానికి ఇండియానే కారణంః సన్నీలియోన్

Sunny Leone : సన్నీలియోన్ పేరు వింటే కుర్రాళ్లు ఊగిపోతారు. ఆమెకు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు పోర్న్ స్టార్ గా ఆమె ప్రపంచాన్ని ఊపేసింది. ఆ తర్వాత ఇండియాకు వచ్చి బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. కేవలం బాలీవుడ్ కు పరిమితం కాకుండా అన్ని భాషల్లో సినిమల్లో నటించింది.

అదే సమయంలో ఐటెం సాంగ్స్ లలో కూడా నటించింది. తెలుగులో కూడా గరుడ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. కాగా సన్నీలియోన్ ఇండియాకు వచ్చిన తర్వాత పోర్న్ వీడియోలు చేయడం మానేసింది. అయితే తాజా ఇంటర్వ్యూలో ఆమె ఎందుకు పోర్న్ వీడియోలు మానేసిందో పూర్తి క్లారిటీ ఇచ్చింది.

ఆమె మాట్లాడుతూ.. నేను పోర్న్ స్టార్ గా ఉన్నప్పుడు చాలా అవమానాలు ఎదుర్కున్నాను. నాకు హిందీ బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చినప్పుడు నాకు సంతోషంగా అనిపించింది. కానీ చాలామంది నాకు ఫోన్ చేసి బెదిరించారు. ఇండియాకు వస్తే చంపేస్తాం అంటూ అన్నారు. కానీ నేను అవేవీ పట్టించుకోకుండా ఇండియాకు వచ్చాను.

ఇక్కడకు వచ్చిన తర్వాత నాకు బిగ్ బాస్ మంచి లైఫ్‌ ఇచ్చింది. ఆ తర్వాత నాకు చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అందుకే పోర్న్ వీడియోలు మానేశాను. ఇండియా వల్లే నేను పోర్న్ వీడియోలకు దూరంగా ఉంటున్నాను అంటూ తెలిపింది సన్నీలియోన్. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us