Sunitha: నా లాంటి వాళ్ల‌కు ఇదే బెస్ట్ ప్లేస్‌.. సునీత స‌ర్‌ప్రైజింగ్ ట్వీట్

Sunitha:రెండో మ్యారేజ్ త‌ర్వాత సునీత పేరు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయింది. పెళ్లి త‌ర్వాత ఈవిడ సోష‌ల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెట్ట‌డం, లేదంటే ఇంట‌ర్వ్యూలో త‌న ప‌ర్స‌న‌ల్, ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌కి సంబంధించి ప‌లు కామెంట్స్ చేయ‌డంతో సునీత పేరు బాగా నానింది.పెళ్లికి ముందు సునీత చాలా రిజర్వ్‌డ్‌గా ఉండేవారు.

ఏవైనా మ్యూజికల్ ఈవెంట్స్ లేదా ప్రొగ్రామ్స్‌లో తప్ప బయట ఎక్కువగా కనిపించకపోయేవారు. సోషల్ మీడియాలో కూడా పెద్దగా అప్‌డేట్స్ ఏవీ ఉండేవి కాదు. కానీ ఆమె ఇప్పుడు చాలా యాక్టివ్ అయ్యారు. తనకు సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ఫాలోవర్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. ఈక్ర‌మంలో కాస్త హాట్ నెస్ కూడా జోడిస్తుంది.

తన భర్త రామ్ వీరపనేని గురించి ఎవరైనా ఏదైనా అన్నా, తమ దాంపత్య జీవితం మీద ఎవరైనా కామెంట్లు చేసినా తిరిగి కౌంటర్లు వేస్తూ ఉంటోంది. తనకు సోషల్ మీడియాలో ఎంత వరకు ఉండాలి, తన వ్యక్తిగత జీవితాన్ని ఎంత వరకు ప్రొజెక్ట్ చేసుకోవాలి అనే దానిపై క్లారిటీ ఉందంటూ సునీత ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

అందుకే తాను వెకేషన్లకు ఎక్కడికైనా వెళ్తే.. వెంటనే ఫోటోలను షేర్ చేయను అని తెలిపింది. వెకేషన్‌కు వెళ్లి వచ్చాక ఎప్పుడో అలా గుర్తుకు వచ్చినప్పుడు ఆ ఫోటోలను షేర్ చేస్తాను అని సునీత చెప్పుకొచ్చింది. తాజాగా ఈ పాటల కోయిలమ్మ కొన్ని ఫోటోలను ఫేస్‌బుక్, ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. వాటితో పాటు ఓ కామెంట్ కూడా చేసింది.

సునీత చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తనలా ప్రకృతిని ప్రేమించేవాళ్లకు గోవా అనేది బెస్ట్ స్పాట్ అని పేర్కొన్నారు సునీత. తన స్నేహితురాళ్లు పద్మజ, అన్నపూర్ణల గురించి కూడా ప్రస్తావించారు. కాగా గోవా ప్రకృతి అందాలను ఎంజాయ్ చేసిన కుందనపు బొమ్మ సునీత ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఇందులో సునీత ఎంత అందంగా ఉన్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.