Sundar Pichai: పిచాయ్ గారూ.. ఆ పిచ్చి పని మాత్రం చేయకండి..

Sundar Pichai కరోనా వైరస్ సెకండ్ వేవ్ తో తీవ్రంగా పోరాడుతున్న ఇండియాకి ఇంటర్నేషనల్ సంస్థ గూగుల్ రూ.135 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ ఇవాళ సోమవారం ఉదయం ట్విట్టర్ లో ఒక పోస్టు పెట్టారు. కొవిడ్ నియంత్రణకు చర్యలు చేపడుతున్న గివ్ ఇండియాకి, యూనిసెఫ్ కి ఈ ఫండ్ ని అందించనున్నట్లు స్పష్టం చేశారు. మరో వైపు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సైతం భారత్ లో కొవిడ్-19 వ్యాప్తిని చూసి తన హృదయం ముక్కలైందంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్సీజన్ ఎక్విప్మెంట్ల కొనుగోలు విషయంలో ఇండియాకి సాయం చేస్తామని, ఈ మేరకు మైక్రోసాఫ్ట్ తన రిసోర్సులను వినియోగిస్తుందని పేర్కొన్నారు.

నెటిజన్ వెరైటీ రియాక్షన్..



గూగుల్ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటనపై ఒక నెటిజన్ వెరైటీగా స్పందించారు. సుందర్ పిచాయ్ తాను విరాళంగా ఇవ్వనున్న నిధులను ఫలానా ఫలానా సంస్థలకు అందజేస్తానని క్లియర్ గా చెప్పినప్పటికీ ఆదిత్య గుప్తా అనే ఒక వ్యక్తి మాత్రం ‘‘ఆ డబ్బులను మీరు దయచేసి పీఎం కేర్స్ ఫండ్ కి సెండ్ చేయొద్దు. ఎందుకంటే బీజేపీవాళ్లు ఆ అమౌంట్ తో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొంటారు. కరోనా బాధితుల కోసం వినియోగించరు’’ అంటూ సుందర్ పిచాయ్ కి రిప్లై ఇచ్చాడు. తద్వారా కేంద్రంలోని అధికార పార్టీపై సెటైర్లు వేశారు. దీనికి సుందర్ పిచాయ్ ఇంకా రిప్లై ఇవ్వలేదు, భవిష్యతుల్లో ఇవ్వరనుకోండి. అది వేరే విషయం. ఇండియాలో రాజకీయ నాయకుల, అధికారుల వ్యవహార శైలికి ఇదొక చిన్న కౌంటర్ మాత్రమే.

గతేడాది ప్రారంభం..

దేశంలో కొవిడ్-19 మహమ్మారి అంతానికి, బాధితులకు సాయం చేయటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతేడాది మార్చి 27న ‘పీఎం కేర్స్ ఫండ్’ పేరుతో ఒక నిధిని ఏర్పాటుచేశారు. దానికి పలువురు దాతలు పెద్దఎత్తున విరాళాలు ఇచ్చారు. ఆ ఫండ్ ఇటీవల మరోసారి వార్తల్లో నిలిచింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కరోనా టీకా వేయించొచ్చని చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. అది ఉచితం కాదని, ఫ్రీగా ఇవ్వాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వొచ్చంటూ ఉచిత సలహా మాత్రం ఇచ్చింది. దీనికి జవాబుగా తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ‘పీఎం కేర్స్ ఫండ్’లోని డబ్బును దీనికోసం వాడొచ్చు కదా అని సూచించారు.

Advertisement