కరోనా మందుకు 35 రూపాయలు మాత్రమే..!
Admin - August 5, 2020 / 10:36 AM IST

కరోనా ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది. ఇప్పటికే పలు దేశాలు ఈ మహమ్మారిని నివారించేందుకు మందు కోసం అహర్నిశలు కష్టపడుతున్నాయి. అయితే తాజాగా కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు కొన్ని యాంటీ వైరల్ డ్రగ్స్ అందుబాటులోకి వచ్చాయి. దాంట్లో ఒకటి అయిన యాంటీ వైరల్ డ్రగ్ ‘ఫావిపిరవిర్’.
అయితే కరోనా తీవ్రత తక్కువగా ఉన్న రోగుల కోసం ‘ఫావిపిరవిర్-200 ఎంజీ’ ఔషధాన్ని సన్ ఫార్మాసూటికల్ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే ఒక్కో టాబ్లెట్ ధర 35 రూపాయలుగా నిర్ణయించినట్లు సన్ ఫార్మాసూటికల్ ఇండస్ట్రీస్ తెలిపింది. ఈ వారంలోనే ఈ మందు మార్కెట్‌లో అందుబాటులోకి వస్తుంది అని సన్ ఫార్మాస్యూటికల్ సంస్థ సీఈఓ కీర్తి గానోర్కర్ వెల్లడించారు.