Sun Glasess : సన్ గ్లాసెస్ ఎలా పుట్టాయో తెలుసా.. అసలెందుకు వాడతారంటే..!!

Sun Glasess : (సన్ గ్లాసెస్ ): కళ్లద్దాలు వాడడం ప్రస్తుతం సమాజంలో చూస్తున్నాం.. కొందరు సైట్ వల్ల కళ్లద్దాలు వాడుతుంటే మరికొందరు స్టైల్ కి, పొల్యూషన్ కళ్ళల్లో పడకుండా, ఇంకొందరు ఎండాకాలంలో చల్లగా ఉండేందుకు ఈ గ్లాసెస్ ను వాడతారు..

Sun Glasess : Do you Know How The Original Sun glasses Where The Born : సన్ గ్లాసెస్
Sun Glasess : Do you Know How The Original Sun glasses Where The Born

ప్రస్తుతం కళ్ళద్దాలలో ఎన్నో రకాల గ్లాసెస్ ఉన్నాయి.. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో సన్ గ్లాసెస్ జోరు మాములుగా ఉండదు. ఈ సన్ గ్లాస్సెస్ ప్రతి ఒక్కరు పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఎండాకాలంలో కళ్ళు చల్లగా ఉండేందుకు , ఎక్కువ ఫోకస్ కళ్లపై పడకుండా ఉండేందుకు ఈ తరహా కళ్లద్దాలు వాడతారు.

అయితే ఎంతో సింపుల్ గా మన కళ్ళకు తగిలించుకునే ఈ కళ్ళద్దాలకు ఓ పెద్ద చరిత్ర ఉందొ చాల కొద్దీ మందికే తెలుసు.. గతంలో కళ్ళను రక్షించుకోవడం కోసం మన పూర్వికులు జంతువుల దంతాల్ని కళ్లద్దాలుగా చేసి వాటిని ఉపయోగించుకునేవారట. రోమ్, చైనా చరిత్ర ప్రకారం సన్ గ్లాసెస్ కు గొప్ప చరిత్రనే ఉందట.. రోమన్ చక్రవర్తి నీరో తాను స్వయంగా శిక్షణ ఇచ్చిన సైనికుల పోరాటాల్ని చూడడానికి పాలిష్ చేసిన రత్నాలను ధరించేవారు అని, వాటిని ఆధారంగా చేసుకుని నేడు సన్ గ్లాసెస్ వచ్చాయని చెప్తూ ఉంటారు.

ఇక చైనాలో 12 వ శతాబ్దానికంటే ముందే ఈ గ్లాస్ లను వాడారని చరిత్ర కారులు చెప్తున్నారు. 12 వ శతాబ్దంలో ఈ సన్ గ్లాసెస్ ను గోధుమ బూడిద రంగు లేదా నలుపు రంగురాళ్ళతో తయారు చేసి విక్రయించేవారు. అయితే వీటివల్ల ఏ వుండకపోవడమే కాకుండా సూర్యకిరణాలు నేరుగా కంటికి తాకేవి. అసలు వీటిని ఎందుకు తయారుచేశారో తెలుసుకునే ప్రయత్నం చేయగా పురాతనమైన డాక్యుమెంట్ లు ఇతర కీలక సమాచారాన్ని రహస్యంగా విశ్లేషించడం కోసం చదవడం కోసం ఉపయోగించారు అని… చరిత్రలో చైనాకు చెందిన కొన్ని న్యాయస్థానాలలో న్యాయమూర్తులు నిందితుల్ని విచారించే సందర్భంలో వారి హావభావాలను గుర్తించకుండా ఉండటానికి క్రిస్టల్ సన్ గ్లాసెస్ ను ఉపయోగించారని తెలిసింది.

Advertisement