Sumanth : ఏఎన్నార్ కు అసలైన మనవడిని నేనే.. సుమంత్ షాకింగ్ కామెంట్లు..!

NQ Staff - June 13, 2023 / 01:37 PM IST

Sumanth : ఏఎన్నార్ కు అసలైన మనవడిని నేనే.. సుమంత్ షాకింగ్ కామెంట్లు..!

Sumanth : అక్కినేని నాగేశ్వర్ రావు తర్వాత ఆ ఫ్యామిలీలో ఆ స్థాయిలో ఎవరూ రాణించట్లేదు. అక్కినేని నాగార్జున మాత్రమే అంతో ఇంతో పర్వాలేదు అన్న స్థాయికి ఎదిగాడు. కానీ ఆయన తర్వాత ఎంట్రీ ఇచ్చిన ఏ ఒక్కరు కూడా ఆ స్థాయిలో రాణించట్లేదు. ఆయన కొడుకులు చైతూ, అఖిల్ అయితే కనీసం నటులుగా కూడా నిరూపించుకోలేకపోతున్నారు.

అప్పట్లో సుమంత్ మంచి సినిమాలు చేశాడు. కానీ పెద్దగా స్టార్ డమ్ ను సంపాదించుకోలేకపోయాడు. ఇప్పుడు నటుడిగా కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. ఇప్పుడు ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో ఆయన షాకింగ్ కామెంట్లు చేశాడు.

మీ తాత గారు అక్కినేని నాగేశ్వర్ రావు బయోపిక్ సినిమా తీస్తే మీ ఫ్యామిలీలో ఎవరు సూట్ అవుతారు అని అడగ్గా.. అందుకు నేను మాత్రమే కరెక్టుగా సరిపోతాను. ఆయన బయోపిక్ లో ఆయన పాత్రకు నేను మాత్రమే న్యాయం చేయగలిగాను. ఎందుకంటే ఆయన పోలికలు కేవలం నాకు మాత్రమే వచ్చాయి.

Sumanth Wants Do Biopic Of Akkineni Nageswar Rao

Sumanth Wants Do Biopic Of Akkineni Nageswar Rao

మా కుటుంబంలో ఇంకెవ్వరికీ ఆయన పాత్ర చేయడం సాధ్యం కాదు అంటూ కుండ బద్దలు కొట్టేశాడు అక్కినేని నాగేశ్వర్ రావు. ఆయన చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. అక్కినేని అసలు హీరోలను పక్కన పెట్టేసి నువ్వు ఎలా నటిస్తావ్ అంటూ కొందరు ఆయనపై సీరియస్ అవుతున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us