Suma: ఇన్నాళ్ల నుండి దాచిపెట్టిన సీక్రెట్‌ని బ‌య‌టపెట్టిన సుమ‌.. అది విని నోరెళ్ల‌పెట్టిన ఫ్యాన్స్

Suma: బుల్లితెర ప్రపంచంలో క్వీన్‌గా వెలుగు వెలుగుతున్న యాంక‌ర్ సుమ‌. మ‌ల‌యాళీ అయిన‌ప్ప‌టికీ అచ్చ‌మైన తెలుగులోమాట్లాడుతూ ఎదుటివారి నోరు క‌ట్టిప‌డేస్తుంది.ఎంత పెద్ద స్టార్ హీరో అయిన సుమ‌కి త‌ప్ప‌క గౌర‌వం ఇస్తారు. చాలా ఏళ్ల నుండి యాంక‌రింగ్ చేస్తూ వ‌స్తున్న సుమ ఇప్ప‌టికీ కుర్ర యాంక‌ర్స్ కి పోటీ ఇస్తూనే ఉంది.

కేరళ కుట్టి సుమ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ.. అభిమానులను అలరిస్తుంది. బుల్లి తెరపై ఎంతమంది యాంకర్స్ ఉన్నా సుమ నే ఇప్పటికీ టాప్ యాంకర్. వరస షోలతో బిజీబిజీగా ఉండే సుమ.. ఇటీవ‌ల త‌న ప‌ర్స‌న‌ల్ ప్రొఫెష‌న‌ల్ విష‌యాలను దాప‌రికం లేకుండా చెప్పేస్తుంది. తాజాగా చాలాకాలంగా దాచిపెట్టిన ఒక విషయాన్ని అభిమానులతో షేర్‌ చేసుకుంది.

‘చాలా ఏళ్ల నుంచి ఒక విషయం దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చాను. ఇకపై దాన్ని దాచాలనుకోవడం లేదు. నేను కీలాయిడ్‌ టెండెన్సీ అనే స్కిన్‌ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నా. అంటే ఏదైనా గాయం అయితే అది మరింత పెద్దదిగా చుట్టుపక్కల వ్యాపిస్తుంది. అంటే చిన్న గాయం కూడా పెద్దదిగా చూపిస్తుందనమాట.

ఇది న‌యం చేసుకోవ‌డానికి చాల ప్ర‌య‌త్నించాను. కానీ ఫలితం లేదు. ఇది నా శరీరంలో భాగమైపోయిందని అర్థమైంది. గతంలో ఈ ప్రొఫెషనలిజంలోకి వచ్చినప్పడు మేకప్‌ ఎలా వేసుకోవాలి, ఎలా తీసేయాలి వంటివి తెలియక జరగాల్సిన డ్యామెజ్‌ జరిపోయింది. ఇప్పుడు ఉన్నదాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను.

సాదారణంగా మన బాడీలో ఏదైనా మనకు నచ్చకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని దాచిపెడుతూ వస్తాం. కానీ అది మన శరీరంలోనే ఉంటుంది అని తెలిసినప్పుడు దాన్ని అంగీకరించాలి. అప్పుడే మనం సంతోషంగా ఉండగలం’ అంటూ సుమ ఓ వీడియోను షేర్‌ చేసింది.