ఒక్క ఫోటో తో ఫేక్ వార్తలకు ముగింపు పడినట్టే

Advertisement

తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకత గుర్తింపును తెచ్చుకుంది యాంకర్ సుమ కనకాల. అయితే ఆమె యాంకరింగ్ తో ప్రతిఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది. ఎంతమంది యాంకర్స్ వచ్చినా కూడా సుమ మాత్రం ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అంటూ ప్రతిఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ఇక ఆమె మాటలకు పడిపోని వాళ్లంటూ ఎవరు ఉండరు.

అయితే కొన్ని రోజుల క్రితం నుండి సుమ కనకాల, తన భర్త రాజీవ్ కనకాలతో విడాకులు తీసుకుంటుంది అని తెగ ప్రచారం జరుగుతుంది. అయితే సంపాదన విషయంలో వీళ్లిద్దరికీ గొడవలు వచ్చాయి అని అంటున్నారు. అంతే కాదు సుమ చాలా కాలంగా ఒంటరిగానే మరో ఇంట్లో ఉంటుందని సన్నిహితులు నుండి వార్తలు కూడా వచ్చాయి. ఒకవైపు సుమ ఈ విషయం పై స్పందిస్తూ ఫేక్ వార్తలు సృష్టించొద్దని, మా మధ్య ఎలాంటి వివాదాలు లేవని తెలిపింది.

ఇది ఇలా ఉంటె తాజాగా సుమ కనకాల సోషల్ మీడియాలో ఒక ఫోటో పెట్టింది. అయితే నేడు సుమ తల్లి జన్మదినాన్ని పురస్కరించుకొని ఓక ఫోటో పోస్ట్ చేసింది. తన తల్లి తో సహా ఇద్దరు పిల్లలు, భర్త రాజివ్ పక్కన నిలబడి దిగిన ఫోటోను సుమ సోషల్ మీడియాలో పంచుకుంది. ఇక ఈ ఈ ఫోటో తో సుమ పై వస్తున్న ఫేక్ వార్తలకు ముగింపు పడింది అని చెప్పుకుంటున్నారు సుమ అభిమానులు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here