Pawan Kalyan : మహేశ్ వద్దన్న కథతో సినిమా చేస్తున్న పవన్ కల్యాణ్.. కొంప ముంచిన డైరెక్టర్..!
NQ Staff - February 1, 2023 / 02:41 PM IST

Pawan Kalyan : రీ ఎంట్రీ తర్వాత పవన్ కల్యాణ్ చాలా బిజీగా మారిపోయాడు. వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే రెండు, మూడు సినిమాలను అనౌన్స్ చేసేస్తున్నాడు. ఇప్పటికే హరిమర వీరమల్లు సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన తాజాగా మరో మూవీని ప్రారంభించాడు.
బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ అనిపించుకున్నాడు సుజిత్. సినిమా హిట్ కాకపోయినా.. కలెక్షన్లు మాత్రం భారీగానే వచ్చాయి. ఎందుకంటే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో ఆమాత్రం కలెక్షన్లు వచ్చాయి. అప్పటి నుంచి ఖాళీగానే ఉన్న సుజిత్ తాజాగా పవన్ తో తన మూడో సినిమాను ప్రకటించాడు.
ట్రెండింగ్ లోకి సుజిత్..
ఈ సినిమాను పవన్ చాలా ఇంపార్టెంట్ గా తీసుకున్నాడు. మొన్న అన్నపూర్ణ స్డూడియోలో పవన్ కల్యాణ్-సుజిత్ కాంబోలో వస్తున్న ఓజీ(ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) మూవీ ప్రారంభోత్సవం జరిగింది. అప్పటి నుంచి సుజిత్ పేరు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అయితే ఈ మూవీకి ముందుగా పవన్ అనుకోలేదంట.
వాస్తవానికి ఈ కథను ముందుగా మహేశ్ బాబుకు చెప్పాడంట సుజిత్. ఆయన వద్దని రిజెక్ట్ చేయడంతో అదే కథను పవన్ కల్యాణ్‌కు చెప్పి ఓకే చేయించుకున్నాడు సుజిత్. ఈ విషయం తెలుసుకున్న పవన్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహేశ్ రిజెక్ట్ చేశాడంటే ఆ కథలో ఏవో లోపాలు ఉన్నాయి కావచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు.