Suhana Khan Assets Value : లగ్జీర బంగ్లా కొనుగోలు చేసిన షారుఖ్ కూతురు.. ఎన్ని కోట్లో తెలుసా..?
NQ Staff - June 24, 2023 / 10:51 AM IST

Suhana Khan Assets Value : బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అంటే తెలియని వారుండరు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. కాగా ఆయన పిల్లలు కూడా ఇప్పుడు పెద్ద వారయ్యారు. ఆయన కూతురు సుహానా ఖాన్ కు కూడా చాలమంది ఫ్యాన్స్ ఉన్నారు. స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందాలు ఆమె సొంతం.
అలాగే ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫొటోలు ఎప్పటికప్పుడు పోస్టు చేస్తూనే ఉంటుంది ఈ భామ. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది. ఆమె తాజాగా ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసింది.
ఆమె కొనుగోలు చేసిన ప్రాపర్టీలో ఎకరంన్నద భూమితో పాటు 2218 చదరపు అడుగుల్లో ఒక ఇళ్లు ఉంది. దీనికోసం 77 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించింది సుహానా. ముంబైలోనే అత్యంత ఖరీదైన ప్రాంతం అలీబాగ్ లోనే ఆమె ఇల్లును కొనుగోలు చేసింది. ఇక్కడే షారుఖ్ ఖాన్ ఇల్లు కూడా ఉంది.
అలాగే రణ్ వీర్ సింగ్, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు కూడా ఇక్కడే నివసిస్తున్నారు. సుహానా కొనుగోలు చేసిన ప్రాపర్టీ విలువ దాదాపు రూ.1291కోట్లు ఉంటుందని తెలుస్తోంది. గతంలో ఆమె ఒక ప్లాట్‌ని కొనుగోలు చేసినట్టు బాలీవుడ్ మీడియా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమెది అర్చీస్ అనే సినిమాతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తోంది.