Gaalodu : గాల్లో తేలినట్టుందే.! ‘గాలోడు’ సుధీర్ పట్టరాని ఆనందం.!

NQ Staff - November 24, 2022 / 06:29 AM IST

Gaalodu : గాల్లో తేలినట్టుందే.! ‘గాలోడు’ సుధీర్ పట్టరాని ఆనందం.!

Gaalodu : ఒకే ఒక్క సినిమాతో సుడిగాలి సుధీర్ దశ తిరిగిపోయింది. బుల్లితెరపై స్టార్ కమెడియన్ కాస్తా, వెండితెరపై మాస్ హీరో అయిపోయాడు ‘గాలోడు’ సినిమాతో.

నిజానికి, ‘గాలోడు’ కంటే ముందే ‘త్రీ మంకీస్’ అనీ, ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ అనీ పలు ప్రయత్నాలు చేశాడు వెండితెరపై. కానీ, అవేవీ అతనికి హిట్ ఇవ్వలేకపోయాయి. ‘గాలోడు’ సినిమాకి తొలుత మిక్స్‌డ్ రివ్యూలు, నెగెటివ్ రివ్యూలు వచ్చాయి.

సీన్ మారింది.. హిట్టు సొంతమైంది..

‘గాలోడు’ సినిమాలోని మాస్ కంటెంట్‌కి ఓ వర్గం ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. చిన్న సినిమాల్లో పెద్ద హిట్ అనిపించేసుకుంది గాలోడు ఇప్పుడు. దాంతో, సుధీర్ పట్టరాని ఆనందంతో వున్నాడు.

‘నా జీవితానికి ఇంతకన్నా ఇంకేం కావాలి.?’ అంటూ ‘గాలోడు’ సినిమా సక్సెస్ గురించి చెబుతున్నాడు సుధీర్. ‘గాలోడు’ సినిమా తర్వాత మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయని సుధీర్ చెబుతుండడం గమనార్హం.

ఇప్పుడే, కెరీర్‌ని ఇంకాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి వుంటుంది. తప్పటడుగు వేస్తే అంతే సంగతులు. మరి, సుధీర్ మంచి ప్లానింగ్‌తో సినిమాలు చేసుకుంటాడా.? తనకొచ్చిన స్టార్‌డమ్‌ని కొన్నాళ్ళు నిలబెట్టుకోగలుగుతాడా.? వేచి చూడాల్సిందే.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us