Sudheer-Rashmi : సుధీర్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కి రష్మీ అదిరిపోయే రియాక్షన్..

Sudheer-Rashmi: టెలివిజన్ ఛానెల్స్ లో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించే సెలెబ్రిటీలు ఎంతో మంది ఉన్నారు. వారిలో ఎప్పటికప్పుడు అభిమానుల్ని ఎంటర్ టైన్ చేస్తూ.. క్రేజియస్ట్ కపుల్ గా నిలిచారు జబర్థస్త్ రష్మీ, సుడిగాలి సుధీర్. వీరి జంట టెలివిజన్ పైకి వచ్చి ఎన్నో సంవత్సరాలవుతున్నా.. ప్రేక్షకుల్లో మాత్రం తమ క్రేజ్ ను కొనసాగిస్తున్నారు. ఢీ, జబర్దస్త్ లాంటి పాపులర్ షోస్ లో వీరిద్దరి పర్ఫార్మెన్స్ వల్లే షో నడుస్తుందన్నా ఆశ్చర్యం లేదు. వీరద్దరూ ఎప్పటికప్పుడు కౌంటర్ లు, పంచ్ లు, టాస్క్ లతో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటారు. వీరిద్దరూ చేసే అల్లరి అంతాఇంతా కాదు. లేటెస్ట్ గా ఢీ షోకి సంబంధించి ఓ ప్రోమోను రిలీజ్ చేసింది టీవీ ఛానెల్. ఆ ప్రోమోలో సుధీర్ చెప్పిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియా తెగ ట్రెండ్ అవుతున్నాయి.

రష్మీ సుధీర్ ను టాస్క్ లో భాగంగా ర్యాగ్ చేయడానికి ట్రై చేస్తుంటే రివర్స్ లో సుధీర్, రష్మీని ర్యాగింగ్ చేశారు. అసలు విషయానికి వస్తే.. ఈ ప్రోమోలో రష్మీ, దీపికా పిల్లి కాలేజ్ లో చదువుతున్న సీనియర్ అబ్బాయిలుగా..సుధీర్, హైపర్ ఆది లు జూనియర్ అబ్బాయిలుగా స్కిట్ వేశారు. స్కిట్ లో భాగంగానే సుధీర్, రష్మీని చూసి చీరలో మీరు చాలా అందంగా ఉన్నారని, హెయిర్ స్టైల్ కూడా బావుందని సుధీర్ చెప్పారు. సుధీర్ అలా చెప్పగానే, రష్మీ తెగ సిగ్గుపడటం హైలెట్. ఎందుకంటే స్కిట్ లో అబ్బాయి క్యారెక్టర్ అని చెప్పినా రష్మీ సిగ్గు పడుతుందంటూ యాంకర్ ప్రదీప్ పంచ్ వేశారు.

ఆ తరువాత స్కిట్ లో ఆది, సుధీర్ లు అమ్మాయిల్లా సిగ్గు పడుతూ ఎంట్రీ ఇవ్వడం మరో ఫన్ ఫ్యాక్ట్. రష్మీ సుధీర్ తో ఫ్రెషర్సా అని అంటే సుధీర్ ఫ్రెష్ అంటూ డబుల్ మీనింగ్ రేంజ్ లో డైలాగ్ చెప్పారు.ఆ తరువాత పేర్లు చెప్పమంటే ఆది తన పేరు ఆదమ్మ అని సుధీర్ పేరు సూదమ్మ అని చెబుతాడు. దీపికా పిల్లి మీరు ఊర్లో ఏం చేస్తుంటారని అడగగా సుధీర్ మేము ఊర్లో విత్తనాలు వేస్తూ ఉంటామని చెప్పగా.. నువ్వు విత్తనాలు వేస్తే ఎవరు కోస్తారంటూ రష్మీ అడుగుతుంది. అక్కే విత్తనాలు కోసుకుంటుందంటూ ఆది మళ్లీ పంచ్ వేస్తాడు. ఏది ఏమైనా ప్రస్తుతం ఢీ షో ప్రోమోలో ట్రెండింగ్ లో వైరల్ అవుతుంది.