Crowd Funding : నిరుపేద ఇంట సంబరం : 500 అడిగితే, 51 లక్షలు వచ్చాయ్.!
NQ Staff - December 22, 2022 / 05:09 PM IST

Crowd Funding : ఓ నిరుపేద కుటుంబం తన దీన స్థితి నేపథ్యంలో 500 రూపాయల సాయం కోసం ఎదురుచూస్తే, అనూహ్యంగా 50 లక్షలు వచ్చిపడ్డాయ్.! ఈ అద్భుతం కేరళలో చోటు చేసుకుంది. నిజానికి, ఇది అద్భుతం కానే కాదు.. మానవత్వం మాత్రమే.!
వివరాల్లోకి వెళితే, కేరళలోని పాల్కాడ్కి చెందిన సుభద్ర అనే 45 ఏళ్ళ మహిళకు ముగ్గురు కొడుకులు. చిన్న కుమారుడికి రిబ్రల్ పాల్సి అనే అనారోగ్య సమస్య వుంది. కదల్లేని పరిస్థితుల్లో మంచం మీదే వుంటాడతడు. సుభద్ర భర్త చనిపోయాడు.. దాంతో, కుటుంబ పోషణ బాధ్యత ఆమెదే.
మానవత్వం పరిమళించినవేళ..
తన రెండో కుమారుడు చదువుకుంటున్న స్కూల్ టీచర్ గిరిజను 500 రూపాయలు అప్పుగా అడిగింది సుభద్ర. సుభద్ర దీన స్థితిని తెలుసుకుని, 500 రూపాయలు సాయంగా ఇచ్చారు ఆ టీచర్. అయితే, సుభద్ర ఇంటికి వెళ్ళి ఆమెతో మాట్లాడిన టీచర్ గిరిజ, ఆమె పరిస్థితి చూసి చలించి పోయారు.
క్రౌడ్ ఫండింగ్ ద్వారా సుభద్రకు సాయం చేయాలని భావించి, ఆమె దీనగాధను పేర్కొన్నారు. బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేశారు గిరిజ. దాంతో, క్రౌడ్ ఫండింగ్ రూపంలో 50 లక్షల రూపాయలు వచ్చి పడ్డాయి.
టీచరమ్మ కాదు, దేవత.. అంటూ గిరిజ గురించి సుభద్ర చెబుతోంది. తమ కుటుంబ కష్టాలు తీరిపోయినట్లేననీ, ఎందరో మానవత్వమున్నవాళ్ళు తమ కుటుంబాన్ని ఆదుకుంటున్నారని సుభద్ర చెప్పుకొచ్చారు.