ఆన్ లైన్ క్లాసులు అర్ధం కావడం లేదని విద్యార్థి ఆత్మహత్య

Advertisement

కరోనా కారణంగా విద్య సంస్థలు అన్ని కూడా మూతపడ్డాయి. దీనితో తాజాగా విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే చాలామందికి ఈ ఆన్ లైన్ క్లాసులు అర్ధం కావడం లేదు. ఇక ఇదే తరుణంలో ఒక విద్యార్థికి ఆన్ లైన్ క్లాసులు అర్ధం కావడం లేదని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరవల్లూరు జిల్లా పొన్నెరీ అరుమంతై గ్రామంలో చోటుచేసుకుంది.

అయితే చెన్నై నగరంలోని భారతి మహిళా కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న దర్శిని ఇంటి దగ్గర నుండి ఆన్ లైన్ క్లాసులు వింటుంది. ఈ క్రమంలో క్లాసులు అర్ధం కావడం లేదని తన తల్లితో తెలిపింది. తల్లి సర్ది చెప్పిన తనకు ఆ వత్తిడి తగ్గలేదు. దీనితో క్లాసులు అర్ధం కావడం లేదని భాదతో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here