Strange temple : వింత ఆలయం.. అక్కడ రాత్రి పడుకుంటే శిలలుగా మారుతారు..!
NQ Staff - September 5, 2023 / 01:56 PM IST

Strange temple : మన దేశం ప్రాచీన పద్థతులు, ఆచారాలకు నెలవు. అయితే మన దేశంలో చాలా చోట్ల వింత ఆచారాలు ఇప్పటికీ పాటిస్తున్నారు. చంద్రుని మీదకు రాకెట్లు పంపిస్తున్న ఇంత టెక్నాలజీ యుగంలో కూడా కొన్ని వింతలు ఉన్నాయి. అవి సైన్స్ కు కూడా అందట్లేదు. అలాంటి ఆలయాలు మన దేశంలో చాలానే ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఇప్పుడు మనం ఒక ఆలయం గురించి చెప్పుకుందాం. అక్కడ రాత్రి పూట పడుకుంటే కచ్చితంగా శిలలుగా మారిపోతారంట. ఇది వినడానికి భయంగానే కాదు వింతగా కూడా ఉంటుంది. మరి ఆ ఆలయం ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఆ ఆలయం రాజస్థానంలోని బార్మర్ జిల్లాలో ఉంది. దీనిని కిరాడు ఆలయంగా ఇక్కడి వారు పిలచుకుంటారు. ఈ ఆలయ నిర్మాణం దక్షిణ భారత శైలిని పోలి ఉంటుంది. ఈ ఆలయం అందమైన శిల్పాలతో ఆకట్టుకునే నిర్మాణంతో ఉంది. ఈ ఆలయాన్ని రాజస్థాన్ ఖజురహో అని కూడా పిలుస్తారు. ఒక నివేదిక ప్రకారం, క్రీ.పూ.1161లో ఈ ప్రదేశం పేరు ‘కిరాత్ కూప్’. ఇది ఐదు దేవాలయాల సమూహం. ఇప్పుడు ఇక్కడ చాలా దేవాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. శివాలయం, విష్ణు దేవాలయం పరిస్థితి బాగానే ఉంది. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దానిపై ఖచ్చితమైన సమాచారం లేదు.
అయితే ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి చాలానే కట్టు కథలు ఉన్నాయి. కాగా ఒకప్పుడు ఇక్కడ జరిగిన ఘటనలతో ప్రజలు ఇప్పటికీ భయపడిపోతూనే ఉన్నారు. అప్పటి భయం ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఆలయానికి ఓ ఆలసక్తికరమైన కథ కూడా ఉంది. 8 వందల ఏళ్ల క్రితం మహర్షి తన శిష్యులతో కలిసి దేశ సంచారంలో భాగంగా ఈ ఆలయానికి చేరుకున్నాడంట. ఒకరోజు ఆయన శిష్యులను ఆలయంలో ఉంచి ఏదో పని మీద బయటకు వెళ్లారు. అయితే శిష్యులలో ఒకరికి ఆరోగ్యం బాగా లేదు. వారు గ్రామస్తుల సాయం కోరినా వారు చేయలేదు.
కానీ ఓ మహిళ మాత్రం సాయం చేసిందంట. ఈ విషయం తెలుసుకున్న మహర్షి చాలా కోపానికి గురయ్యారు. తన శిష్యులకే సాయం చేయలేదనే కోపంతో సాయంత్రం తర్వాత ప్రజలంతా రాళ్లుగా మారతారని గ్రామస్తులను శపించాడు. అంతే కాకుండా తన శిష్యులకు సాయం చేసిన మహిళను సాయంత్రం కాక ముందే ఊరు విడిచి వెళ్లిపోవాలని చెప్పారు. కానీ ఆమె వెళ్లే సమయంలో ఊరు వైపు తిరిగి చూసిందంట. దాంతో ఆమె కూడా శిల్పంగా మారిపోయింది.
ఆ స్త్రీ విగ్రహం ఇప్పటికీ అక్కడ కనిపిస్తుంది. అప్పటి నుండి నేటి వరకు ఈ విషయంపై ప్రజలు భయాందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. సాయంత్రం అయితే చాలు ఈ కిరాడు ఆలయంలో ఎవరూ ఉండరు. ఇప్పటికీ ఆ ఆలయానికి సాయంత్రం ఎవరూ వెళ్లరు. అక్కడ పడుకుంటే రాయిగా మారిపోతారనే నమ్మకం ఇప్పటికీ ఆ ఊరు ప్రజల్లో ఉంది.