Uttar Pradesh : అక్క కొడుకుపై మోజుతో ఆమె చేసిన పనికి ఏం చేసినా తప్పులేదు
NQ Staff - February 2, 2023 / 06:31 PM IST

Uttar Pradesh : కామంతో కళ్ళు మూసుకు పోయినప్పుడు బంధాలు అనుబంధాల గురించి ఆలోచించరేమో అనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ సంఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. అసిఫ్ అనే వ్యక్తి గత కొన్నాళ్లుగా బట్టల షాప్ నడుపుతున్నాడు. అతడి బాబాయి గత సంవత్సరం అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. బాబాయ్ భార్య గత కొన్నాళ్లుగా తనకు మగ దిక్కుగా ఉండాలంటూ ఆసిఫ్ ని ఒత్తిడి చేయడం మొదలు పెట్టిందట.
మొదట ఆమెని లైట్ తీసుకున్న అసిఫ్ ఆమె ప్రవర్తన శృతి మించడంతో కుటుంబ సభ్యులకి తెలియజేశాడట. దాంతో కొన్నాళ్ల పాటు వివాదం కొనసాగింది. డిసెంబర్ నెలలో పెళ్లి జరగాల్సి ఉంది కానీ ఆ పెళ్లిని ఆమె ఆపేసింది.
గతంలోనే ఆసిఫ్ కి తనకి పెళ్లయిందంటూ ఒక మ్యారేజ్ సర్టిఫికెట్ ని కూడా ఆమె క్రియేట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అసిఫ్ ని అల్లుడుగా చేసుకోవాలనుకున్న కుటుంబం ఈ గొడవ అంతా మాకెందుకు అని పెళ్లిని రద్దు చేసుకుంది.
ప్రస్తుతం అసిఫ్ మరియు అతడి పిన్ని వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఆసిఫ్ మాత్రం ఆమెతో తనకి ఎలాంటి సంబంధం లేదని బల్ల గుద్ది చెప్తున్నాడు. ఆమె మాత్రం మా ఇద్దరికీ పెళ్లి అయ్యిందని వాదిస్తుంది. ప్రస్తుతానికి ఈ విషయం పెద్ద మనుషుల వద్ద ఉంది. త్వరలోనే అసలు విషయం బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.