Viral News : బెడ్‌ పై పాడు పని చేసినందుకు గాను ప్రియుడిపై ప్రియురాలు కత్తితో దాడి

NQ Staff - January 18, 2023 / 04:39 PM IST

Viral News : బెడ్‌ పై పాడు పని చేసినందుకు గాను ప్రియుడిపై ప్రియురాలు కత్తితో దాడి

Viral News  : అమెరికాలోని లూసియానాలో విచిత్రమైన సంఘటన జరిగింది. బ్రియానా లాకోస్ట్‌ అనే యువతి గత ఏడాదిన్నర కాలంగా ఒక యువకుడితో సహజీవనం చేస్తోంది. ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండేవారు, ఇద్దరి మధ్య సానిహిత్యం చాలా బాగా కుదిరింది. పెళ్లి కూడా చేసుకోవాలని భావించారు.

అంతలోనే లాకోస్ట్ కత్తితో ప్రియుడి పై దాడి చేయడం సంచలనంగా మారింది. లాకోస్ట్ కత్తి తో దాడి చేయడానికి కారణం అతడు బెడ్ పై చేసిన పాడుకొని అంటూ స్వయంగా పోలీసులు తెలియజేశారు.

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. లాకోస్ట్ తన చుట్టు పరిసరాలను ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవాలని భావిస్తుంది. పడుకునేప్పటి నుండి లేసినప్పటి వరకు ప్రతి విషయంలో కూడా శుభ్రతను పాటిస్తూ ఉంటుంది.

అలాంటి లాకోస్ట్ ప్రియుడు నిద్రలో మంచంపై మూత్ర విసర్జన చేశాడు, దాంతో ఆమెకు పట్టరాని కోపం వచ్చింది. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. ఆ పెనుగులాటలో ప్రియుడు వంట గదిలోకి పారి పోయాడు. ఆగ్రహంతో ఊగిపోతున్న లాకోస్ట్ చేతికి అందిన కత్తిని తీసుకొని పొడిచిందని అతడు పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ సంఘటన జరిగిన సమయంలో ఇద్దరు కూడా మద్యం మత్తులో ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతానికి బాధితుడు హాస్పిటల్లో బాగానే ఉన్నాడని.. నిందితురాలు లాకోస్ట్‌ కస్టడీ లో ఉందని పోలీసులు పేర్కొన్నారు.

ఈ విచిత్రమైన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి కానీ, పరిశుభ్రంగా ఉంచడం లేదని అవతలి వారిని ఇలా కత్తితో గాయపరచ వద్దని నెటిజన్స్‌ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us