Mahesh bhupathi: మ‌హేష్ భూప‌తితో లారాద‌త్తా ప్రేమ ప్ర‌యాణం ఎలా సాగిందో తెలుసా?

Mahesh bhupathi: కొన్ని ప‌రిచయాలు, ప్రేమ‌లు, పెళ్లిళ్లు ఎప్పుడు ఎలా జ‌రుగుతాయో చెప్ప‌డం చాలా క‌ష్టం. రంగాల‌కు సంబంధం లేకుండా కొంద‌రు చేసుకునే వివాహాలు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంటాయి. ముఖ్యంగా సినిమా రంగానికి, క్రీడా రంగానికి చెందిన ప్ర‌ముఖులు పెళ్లిళ్లు చేసుకొని వైవాహిక జీవితంలో స్థిర ప‌డ్డారు. అయితే మిస్‌ యూనివర్స్, మోడల్, నటిగా లారా దత్తా .. టాప్‌ టెన్నిస్‌ స్టార్‌గా మహేశ్‌ భూపతి కొద్ది రోజుల క్రితం త‌మ ప్రేమ విష‌యాన్ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

story of mahesh bhupathi
story of mahesh bhupathi

విశ్వసుందరిగా లారా దత్తా ప్రపంచానికి తెలిసేటప్పటికే ఆమె జీవితంలో ఉన్న స్నేహితుడు, సహచరుడు కెల్లీ దోర్జీ . వారిద్ద‌రు పెళ్లి చేసుకుంటార‌ని అంద‌రు ఊహించారు. కాని రిలేష‌న్ బ్రేక‌ప్ అయింది.ఇక మ‌హేష్ భూప‌తితో స్పోర్ట్స్‌ కంపెనీలో ఈ ఇద్దరికీ ముఖాముఖి పరిచయం అయింది. ఆ మీటింగ్‌ ఏదో యాడ్‌కి సంబంధించి అని ప్రచారంలో ఉంది కానీ.. నిజానికి లారాను కలవడానికే మహేశ్‌ ఆ మీటింగ్‌ను ఏర్పాటు చేశాడు.. యాడ్‌ అనేది ఓ మిష మాత్రమే అని అంటారు మహేశ్‌ భూపతి సన్నిహితలు.

మ‌హేష్‌కి మోడల్‌ శ్వేతా జైశంకర్‌తో పెళ్లయింది. లారా కోసం మ‌హేష్ భూప‌తి త‌న వివాహ బంధాన్ని బ్రేక్ చేశాడు. విడాకులతో శ్వేత అతనికి ఆ నిర్ణయాన్ని అమలుపర్చుకునే స్వేచ్ఛనిచ్చింది. కానీ లారాకు ‘హోమ్‌ బ్రేకర్‌’ అనే అపవాదు తప్పలేదు. మహేశ్‌ భూపతి కోసం ఆ అపవాదును మోసింది ఆమె. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడే నేను, మహేశ్‌ ఇద్దరం ఓ ఒప్పందం చేసుకున్నాం.

సాధ్యమైనంత వరకు ఇద్దరం కలిసే బిడ్డను పెంచాలి. అది సాధ్యంకాని పక్షంలో మా ఇద్దరిలో కచ్చితంగా ఎవరో ఒకరైతే బిడ్డను చూసుకోవాలని. పదేళ్లుగా ఆ ఒప్పందాన్ని తు.చ తప్పకుండా పాటిస్తున్నాం’ అని చెప్పింది లారా దత్తా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కింది. 2011, ఫిబ్రవరి 16న.. అంటే వాలంటైన్స్‌ డే అయిన రెండు రోజులకు మహేశ్‌ భూపతి, లారా దత్తా ఒకింటివారయ్యారు.

story of mahesh bhupathi1
story of mahesh bhupathi1

ముంబైలో ఫిబ్రవరి పదహారున అత్యంత సన్నిహితుల మధ్య హిందూ సంప్రదాయం ప్రకారం, తర్వాత ఫిబ్రవరి 20న గోవాలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. మహేశ్‌ భూపతి మాజీ భార్య శ్వేత కూడా చెన్నైకి చెందిన రఘు కైలాస్‌ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. వాళ్లకు ఇద్దరు పిల్లలు. మహేశ్‌ భూపతి, లారా దత్తా దంపతులకూ ఓ కూతురు. పేరు సైరా.ఇలా వారి జీవితాలు సెట్ అయ్యాయి.