MS Dhoni: ధోనీ కోసం దాదాను ఒప్పించడానికి నానా తంటాలు పడ్డ సెలక్ట‌ర్..!

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ ఒక్క పేరు వింటే చాలు క్రికెట్ ప్రేమికులకు ఎనలేని అభిమానం. కెప్టెన్ గా ధోనీ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు ఆయన అభిమానులు. యావత్ భారతదేశానికే కాకుండా క్రికెట్ ఆటకే అతనొక స్ఫూర్తి. ఎంతోమంది ఆటగాళ్లను పరిచయం చేసిన ఘనత తనది. మహేంద్ర సింగ్ ధోనీ పేరుతో ఓ బయోపిక్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే.

Story Behind Sourav Ganguly to let MS Dhoni Keep Wickets
Story Behind Sourav Ganguly to let MS Dhoni Keep Wickets

అయితే మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. టీమిండియాను అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్‌గా నిలిపిన సూపర్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. అంతేనా.. ప్రపంచంలోనే అద్భుతంగా రాణించే ఫినిషర్ల లో ధోనీ ఒకరు. భారత్ వైపు నుండి నంబర్ వన్ వికెట్ కీపర్. అయితే అంతర్జాతీయ క్రికెట్ కి ధోనీ అడుగు పెట్టడంలో.. బీసీసీఐ మాజీ సెలక్టర్ కిరణ్ మోరే కీలక పాత్ర పోషించారు.

2003 వన్డే ప్రపంచకప్ తర్వాత ఓ వికెట్ కీపర్ ను జట్టులోకి తీసుకోవాలనుకున్నారు. అయితే అప్పటికి కీపింగ్ చేస్తున్న రాహుల్ ద్రవిడ్‌‌పై ఒత్తిడి తగ్గించడంతో పాటు మంచి ఫినిషర్ అయితే బావుంటుంది అనుకున్నారు. ఆ ప్లేస్ ను రీప్లేస్ చేసే విధంగా ఉండాలని భావించారు. అయితే 6, 7 స్థానాల్లో బ్యాటింగ్ ఆడుతూ.. వేగంగా 40-50 పరుగులు చేసే క్రికెటర్ ఉంటే బావుంటుంది. ఈ క్రమంలో అనుకోకుండా ధోనీ ఆడే ఓ మ్యాచ్ కు వెళ్లారు మోరే. అక్కడ 170 పరుగులకు గాను.. ధోనీ ఒక్కడే 130 పరుగులు చేసిన తీరు ఎంతగానో నచ్చింది. అందుకే వెంటనే మోరే కు ఒక ఆలోచన వచ్చింది.

అలా ఈస్ట్ జోన్ తరఫున ధోనీతో కీపింగ్ చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటికీ ఆ టీమ్ తరఫున డీప్ దాస్ గుప్తా కీపింగ్ చేస్తున్నారు. ఈ విషయం గురించి గంగూలీతో తీవ్రంగా చర్చించారు మోరే. అప్పటికే వారు టీమ్ ఇండియా కి ఆడుతున్నారు. ఈస్ట్ జోన్ కు ధోని ను ఆదించడానికి.. గంగూలీను ఒప్పించడానికి పది రోజులు పట్టింది. అలా ఒప్పించిన మ్యాచ్ లో ధోనీ తొలి ఇన్నింగ్స్‌లో 21 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 60 పరుగులు చేశాడు. ఆ తర్వాత భారత క్రికెట్ జట్టు ఎంతటి ఘనతను సాధించిందో అందరికి తెలుసు.