Suresh Babu : రోడ్డుపై ట్రాఫిక్ కంట్రోల్ చేసిన స్టార్ నిర్మాత సురేష్ బాబు
NQ Staff - January 3, 2023 / 09:42 PM IST

Suresh Babu : హైదరాబాదులో నివసించే వారికి ఏదో ఒక సందర్భంలో ట్రాఫిక్ అవస్థలు తప్పవు. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కూడా ఏదో ఒక సందర్భంలో హైదరాబాద్ ట్రాఫిక్ లో చిక్కుకు పోవాల్సిందే. తాజాగా ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా ట్రాఫిక్ లో చిక్కుకున్నారు.
ఫిలింనగర్ లో ఆయన ప్రయాణిస్తున్న కారు ట్రాఫిక్ లో చిక్కుకోవడంతో స్వయంగా ఆయన కారు దిగి ట్రాఫిక్ కంట్రోల్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. జూబ్లీహిల్స్ లోని ఫిలింనగర్ వద్ద వాహనదారులు అడ్డదిడ్డంగా వచ్చి ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యంలో స్వయంగా ట్రాఫిక్ క్లియర్ చేయడం జరిగింది.
సురేష్ బాబు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక బడా నిర్మాత అయ్యుండి స్వయంగా రోడ్డు పై వాహనాదారులను చక్కబెట్టి ట్రాఫిక్ ని క్లియర్ చేయడం చాలా గొప్ప విషయం అంటూ నెటిజెన్స్ సురేష్ బాబు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక సురేష్ బాబు ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు కాకుండా చిన్న సినిమాలను వరుసగా నిర్మిస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. నిర్మాతగా ఎన్నో సక్సెస్ లు దక్కించుకున్న ఆయన ఒక వ్యక్తిగా కూడా ఇలాంటి పనులు చేయడంతో ఆయన తన యొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని చాటుకుంటున్నాడని పలువురు ప్రశంసిస్తున్నారు.
Star producer @SBDaggubati himself cleared traffic in Hyderabad yesterday 🚥
Hatsoff to you sir 🙏🙏 pic.twitter.com/uSPA9skyEL— Indian Clicks (@IndianClicks) January 3, 2023