Star Heros : అన్నలేమో బడా స్టార్స్‌.. తమ్ముళ్లేమో స్ట్రగ్లింగ్ స్టార్స్‌.. ఏం కష్టాలు బ్రో?

NQ Staff - November 7, 2022 / 10:57 AM IST

Star Heros : అన్నలేమో బడా స్టార్స్‌.. తమ్ముళ్లేమో స్ట్రగ్లింగ్ స్టార్స్‌.. ఏం కష్టాలు బ్రో?

Star Heros : ఇండస్ట్రీలో ఒకరు హీరోగా నిలదొక్కుకున్నారంటే ఆ ఫ్యామిలీ నుంచి మరో హీరో రావడం చాలా కామన్‌. కొంచెం గుడ్‌ లుకింగ్ ఉండి డజను టేకులు తినయినా సీన్‌ ఓకే చేయించుకునే ఏ కాస్తో యాక్టింగ్‌ టాలెంట్ ఉంటే చాలు. బాక్సాఫీస్‌ మీదకి దయ లేని దండయాత్రే ఇక. కానీ ఎంత ప్రయత్నించినా కాలం కలిసిరాక, ప్రేక్షకుల నుంచి యాక్సెప్టెన్స్‌ రాక ఏళ్లకేళ్లు స్ట్రగుల్‌ పడుతూనే ఉంటారు పాపం.

అల్లు శిరీష్‌ ఆ లిస్ట్‌ లో టాప్‌ లోనే ఉంటాడు. అన్న బన్నీ ఏమో ఐకాన్‌ స్టార్‌ గా ప్యాన్‌ ఇండియా రేంజ్‌ లో ఎదిగిపోయాడు. కళ్లముందే కళ్లు చెదిరే హిట్స్‌ తో సెన్సేషన్స్‌ క్రియేట్‌ చేస్తున్నాడు.

అభిమానులను కాకుండా ఏకంగా ఆర్మీనే సంపాదించు కున్నాడు. కానీ అల్లు శిరీష్‌ మాత్రం కెరీర్ మొత్తంలో ఒక్కంటే ఒక్క సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు లాంటి సినిమాలు సో సో హిట్ అనిపించుకున్నా అంతకు మించిన సక్సెస్‌ చూసే భాగ్యం ఇప్పట్లో లేనట్టే ఉంది. పోనీ బ్యాక్‌ గ్రౌండ్ లేదా అంటే అదీ కాదాయే. కోట్లు పెట్టి సినిమాలు తీయగల టాప్‌ ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్ కి కొడుకు.

మెగా ఫ్యామిలీ అనే ట్యాగ్‌ కూడా అడిషనల్‌ స్ట్రెంత్‌. అయినా ఆడియెన్స్‌ అటెన్షన్‌ను డ్రా చేయలేకపోతున్నాడు. లేటెస్ట్‌ గా రిలీజైన ఊర్వశివో రాక్షసివో చిత్రం కూడా ఆశించినంత పాజిటివ్‌ టాక్‌ ఏమీ రాబట్టులేకపోయింది. ప్రస్తుతానికి మిక్స్‌డ్ టాక్‌ తోనే నడుస్తోంది. ఈలెక్కన అల్లు శిరీష్‌ స్టార్‌ హీరో రేంజ్‌ కెళ్లాలంటే కష్టమే సుమీ.

ఇక ఆ లిస్ట్ లో తన పేరును ఎప్పటికప్పుడు రెన్యువల్‌ చేసుకుంటూనే ఉన్నాడు ఆనంద్‌ దేవరకొండ. తన అన్న విజయ్‌ దేవరకొండ అర్జున్‌ రెడ్డితో నేషన్‌ వైడ్ గా ఫేమయ్యాడు. ఒక్క సినిమాతో రేంజ్‌ అండ్ క్రేజ్‌ ను పదింతలు చేసుకుని రౌడీ స్టార్‌ గా రఫ్ఫాడించేస్తున్నాడు.

హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా కామన్‌ ఆడియెన్స్‌లోనే కాదు.. సెలబ్రిటీల్లోనూ తన ఫ్యాన్స్‌ ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతున్నాడు. కానీ ఆనంద్‌ దేవరకొండ మాత్రం సక్సెస్‌ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోతున్నాడు. ఓటీటీల్లో రిలీజయినా, థియేటర్లో విడుదలయినా సేమ్‌ రిజల్ట్. ఓపెనింగ్స్‌, ఓవరాల్‌ కలెక్షన్స్‌ ఏ రకంగా చూసుకున్నా మినిమమ్‌ హిట్ కూడా లేక బండిని లాక్కొస్తున్నాడు.
ఒక్కోసారి బయటి ప్రొడ్యూసర్స్‌ ముందుకు రాకపోయినా తన అన్న బ్యానర్లోనే సినిమా చేసి సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కిద్దామని కలలుకన్నాడు విజయ్‌.

ప్రమోషన్స్‌ లో కూడా తన క్రేజ్‌ను యూజ్‌ చేస్తూ ఫుల్‌ ఎఫర్ట్‌ పెట్టాడు విజయ్‌. అయినా లాభం శూన్యం.అక్కినేని అఖిల్‌దీ అదే పరిస్థితి పాపం. అఫ్‌ కోర్స్‌.. నాగచైతన్య మరీ బడా స్టార్‌, ప్యాన్‌ ఇండియా రేంజ్‌ హీరో కాకపోయినా టాలీవుడ్లో అయినా నటుడిగా నిలదొక్కు కున్నాడు. క్లాస్‌, మాస్‌ చిత్రాలు చేస్తూ అప్పుడప్పుడయినా ఒక్కో జానర్లో హిట్ కొడుతూ అక్కినేని ఫ్యాన్స్‌కి ఆశలు కల్పిస్తున్నాడు. కానీ అఖిల్‌ కి మాత్రం ఆ చాన్స్‌ దొరకడం లేదు.

అసలు నటనేంటో ఏంటో తెలీని వయసులో చేసిన సిసింద్రీ మూవీ సూపర్‌ సక్సెస్‌ సాధించి, క్రేజ్‌ పెంచుకోవాలని తపనపడుతున్న ఈ టైమ్‌ లో భారీ హిట్ రాకపోవడం బాధనిపించే విషయమే.
గంపెడాశలతో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చిన ‘అఖిల్‌’ మూవీ వర్కవుటవ్వలేదు. దాంతో రీ ఎంట్రీల మీద రీ ఎంట్రీలంటూ వరుస సినిమాలతో అక్కినేని అభిమాన గణంతో పాటు ఆడియెన్స్‌ని టార్గెట్‌ చూస్తూనే వస్తున్నాడు.

ఈసారి మాత్రం ఏజెంట్‌ చిత్రంతో ఓ రేంజ్‌ హిట్‌ కొట్టాలన్న కసితో అయితే బానే కష్టపడ్డాడు. కానీ ఆ మూవీని జనాలు ఇష్టపడతారా? లేక వచ్చిన ఆడియెన్స్‌ నే అఖిల్‌ కష్టపెడతాడా అనేది కొద్దిరోజుల్లోనే తేలిపోనుంది. ఇలా అన్నలు సక్సెస్‌ సాధించినా తమ్ముళ్లుగా మాత్రం ఇండస్ట్రీలో తమ మార్క్‌ క్రియేట్‌ చేసుకోని స్ట్రగ్లింగ్ స్టార్స్‌ కి కాలం ఎప్పుడు కలిసొస్తుందో మరి?

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us