Star Heroines : ఇండియాలోనే సోషల్ మీడియా నుంచి అధికంగా సంపాదిస్తున్న టాప్-5 హీరోయిన్లు వీరే..!
NQ Staff - June 6, 2023 / 02:34 PM IST

Star Heroines : సెలబ్రిటీలకు ఇప్పుడు సోషల్ మీడియా అనేది పెద్ద ఇన్ కమ్ సోర్స్ లాగా అయిపోయింది. ఎందుకంటే వారికి సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారు. కాబట్టి ఒక్కో యాడ్ ప్రమోషన్స్ చేసినా సరే వారికి కోట్లలో ఆదాయం వస్తుంటుంది. మరి ఇండియాలో అత్యధికంగా సంపాదిస్తున్న ఐదుగురి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రియాంక చోప్రా..
ఈమెకు భారీ ఫాలోయింగ్ ఉంది ఇండియాలోనే అత్యధిక ఫాలోవర్లు ఉన్నారు. ఆమెకు ఇన్ స్టాలో 87 మిలియన్ కి పైగా ఫాలోయర్స్ ఉన్నారు. ఆమె ఒక యాడ్ ను పోస్టు చేసినందుకు గాను రూ.2 కోట్ల వరకు తీసుకుంటుంది.
దీపికా పదుకొనే..
బాలీవుడ్ భామ దీపికా పదుకొణెకు ఇన్ స్టాలో దాదాపుగా 74 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. ఆమె ఒక్కో యాడ్ ను పోస్టు చేసినందుకు గాను రూ.కోటి నుండి రెండు కోట్ల రూపాయిల వరకు అందుకుంటుందట.
కత్రినా కైఫ్..
ఈమెకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టాలో దాదాపు 72 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. ఒక్కో యాడ్ ను తన ఇన్ స్టా అకౌంట్ లో ప్రమోషన్ చేయడం కోసం దాదాపుగా కోటి వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.
ఆలియా భట్..
ఈమెకు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమెకు ఇంస్టాగ్రామ్ లో దాదాపుగా 77 మిలియన్స్ ఫాలోవర్లు ఉన్నారు. ఒక బ్రాండ్ కంపెనీకి చెందిన యాడ్ ను ప్రమోషన్ చేసేందుకు గాను ఆమె రూ.1.5 కోట్ల నుండి రూ.2 కోట్ల దాకా రెమ్యునరేషన్ ని అందుకుంటుందట.
శ్రద్దా కపూర్..
ఈ భామకు సోషల్ మీడియాలో మామూలు ఫాలోయింగ్ లేదు. ఆమెకు దాదాపుగా 80 మిలియన్ కి పైగా ఫాలోయర్స్ ఉన్నారు. ఒక యాడ్ ను ప్రమోషన్ చేసేందుకు గాను రూ.కోటి 50 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది.