Star Heroines : పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన స్టార్ హీరోయిన్లు వీరే..!

NQ Staff - February 2, 2024 / 11:57 AM IST

Star Heroines : పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన స్టార్ హీరోయిన్లు వీరే..!

Star Heroines :

ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో డేటింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు ప్రేమించుకుని పెళ్లిళ్లు చేసుకునేవారు. కానీ ఇప్పుడు ప్రేమ పేరుతో డేటింగ్ చేస్తున్నారు. పెళ్లికి ముందే అన్ని పనులు కానిచ్చేస్తున్నారు. ఎలాంటి ట్రెండ్ అయినా సరే ముందు సినిమా ఇండస్ట్రీలోనే స్టార్ట్ అవుతుంది. అందుకే అక్కడ అందరూ అంత అడ్వాన్సుగా ఉంటారనే టాక్ ఉంది. కాగా చాలా మంది స్టార్ హీరోయిన్లు ఇప్పుడు పెళ్లికి ముందే డేటింగ్ లు చేస్తుంటే అందులో కొందరు ఏకంగా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ కూడా అవుతున్నారు. అలాంటి వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

శ్రీదేవి…

అలనాటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. స్టార్ హీరోయిన్ గా అన్ని భాషల్లో రాణించింది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న సమయంలోనే బోణీ కపూర్ తో డేటింగ్ చేసింది. వీరిద్దరూ పెళ్లి చేసుకునే సమయానికే శ్రీదేవి ఏడు నెలల గర్భిణి. పెళ్లి అయిన వెంటనే ఆమె జాన్వీకపూర్ కు జన్మనిచ్చింది.

రేణూ దేశాయ్..

అప్పట్లో పవన్ కల్యాణ్‌ సరసన నటించిన రేణూ దేశాయ్ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెళ్లికి ముందే డేటింగ్ పేరుతో కలిసి ఉన్నారు. దాంతో పెళ్లి కాకుండానే అకీరా నందన్ కు జన్మనిచ్చింది రేణూ దేశాయ్. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పాపకు జన్మనిచ్చింది రేణూ దేశాయ్.

కొంకణ సేన్ శర్మ…

కొంకణ సేన్ శర్మ కూడా ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేసి రాణించింది. కాగా ఆమె పెళ్లికి ముందే రణవీర్ షోరేతో చాలా కాలం పాటు డేటింగ్ చేసింది. అయితే వీరిద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లి సమయానికే కొంకణ సేన్ గర్భం దాల్చింది. ఇక పెళ్లి అయిన వెంటనే తాను ప్రెగ్నెంట్ అంటూ ప్రకటించింది.

నీనా గుప్తా…

నీనా గుప్తా అప్పట్లో ఓ సంచలనం. ఆమె వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ తో డేటింగ్ చేసింది. కాగా పెళ్లికి ముందే ఆమె అతనితో డేటింగ్ చేసి ప్రెగ్నెంట్ అయింది. అప్పటికే రిచర్డ్స్ కు మొదటి భార్య ఉంది. కానీ నీనా మాత్రం పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

ఇలియానా…

గోవా బ్యూటీ ఇలియానా కూడా ఈ బాట పట్టింది. ఆమె పెళ్లికి ముందే చాలా మందితో డేటింగ్ చేసింది. చివరకు ఓ ఫారిన్ వ్యక్తితో పెళ్లికి ముందే డేటింగ్ చేసి గర్భవతి అయింది. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తన బిడ్డకు తండ్రి ఎవరనేది చెప్పింది. అయితే పెళ్లి చేసుకోకుండానే ఓ కొడుకును కన్నది.

అమీ జాక్సన్…

అమీ జాక్సన్ కూడా అంతే. ఆమె పెళ్లికి ముందే లండన్ కు చెందిన వ్యాపావేత్తతో డేటింగ్ చేసి గర్భవతి అయింది. ఓ బిడ్డకు జన్మనిచ్చింది కూడా. కొడుకు పుట్టిన తర్వాత మొదటి బాయ్ ఫ్రెండ్ ను వదిలేసి ఇప్పుడు మరో వ్యక్తితో కలిసి తిరుగుతోంది. మరి వీరిద్దరూ అయినా పెళ్లి చేసుకుంటారా లేదా అనేది చూడాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us