హిందీలో ‘ త్రిబుల్ ఆర్ ‘ చిత్ర ట్రైలర్ కు డబ్బింగ్ చెప్పనున్న స్టార్ హీరో !
Admin - November 24, 2020 / 03:25 PM IST

బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించాడు డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి. ఇక ప్రస్తుతం అదే తరహాలో ‘త్రిబుల్ ఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా బట్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.
ఇక ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ తో పాటు పలు భాషల్లో విడుదల చేయనున్నారు. ఇక ఇప్పటికే త్రిబుల్ ఆర్ చిత్ర కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజుల పాత్రలకు సంబందించిన ఫస్ట్ లుక్ ట్రైలర్ లను తెలుగులో విడుదల చేసారు. ఇక ఈ ట్రైలర్ లకు ఈ ఇద్దరు హీరోలే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఇక ఈ ట్రైలర్ కు మంచి స్పందన కూడా లభిస్తుంది. ఇది ఇలా ఉంటె తాజాగా ఈ చిత్రానికి సంబందించిన ఒక వార్త బయటకు వచ్చింది.
అయితే హిందీలో రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రలకు సంబందించిన ట్రైలర్ డబ్బింగ్ ను బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ చేప్పనున్నట్లు కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటులు ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీనితో ఈ సినిమాపై భారీ అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. త్వరలో హిందీ లో కూడా ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.