Jr. NTR : ఇదిరా జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్.. తారక్‌ను కలిసిన స్టార్ క్రికెటర్లు..!
NQ Staff - January 17, 2023 / 10:10 AM IST

Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ మేనియా ఇప్పుడు పాన్ ఇండియాను కూడా దాటిపోతోంది. ముఖ్యంగా త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఆయన రేంజ్ ఏంటో, ఆయన నటనా సామర్థ్యం ఏంటో ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్.. తన ట్యాలెంట్ తోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఆయన చేస్తున్న ఒక్కో సినిమా బాక్సాఫీస్ వద్ద తన దమ్మేంటో నిరూపిస్తున్నాయి.

Star Cricketers Meet Jr. NTR
గత కొంత కాలంగా ఆయన తీస్తున్న ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్లే అవుతున్నాయి. దాంతో ఆయన రేంజ్ అమాంతం పెరిగిపోతోంది. ఇక జక్కన్న దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో బాలీవుడ్ మీడియా, నేషనల్ మీడియాలో తారక్ హైలెట్ అవుతూనే ఉన్నాడు.
ఇమేజ్ పెరిగిందా..
రీసెంట్ గానే గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలో పాల్గొన్న తారక్ ఇమేజ్.. ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీమ్‌ను తాకినట్టు కనిపిస్తోంది. అవునండి బాబు మీరు విన్నది నిజమే. ఎందుకంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ను కొంత మంది క్రికెటర్లు కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Star Cricketers Meet Jr. NTR
నిన్న రాత్రి హైదరాబాద్ లో ఇండియన్ క్రికెట్ టీమ్‌కు చెందిన కొందరు ప్లేయర్లు వచ్చి జూనియర్‌ను కలుసుకున్నారు. వీరంతా గ్రూప్ ఫొటోలు కూడా దిగారు. ఈ ఫొటోలు చూసిన తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తారక్ రేంజ్ ఇది అంటూ హ్యాష్ ట్యాగ్ లతో మోత మోగిస్తున్నారు.