SS Rajamouli Love Affair Leaked : రమా ఉండగానే మరో అమ్మాయిని ప్రేమించిన రాజమౌళి.. చివరకు ఏమైందంటే..?
NQ Staff - June 26, 2023 / 12:51 PM IST

SS Rajamouli Love Affair Leaked : రాజమౌళి.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీని ఏలుతున్న పేరు ఇది. ఆయన నుంచి సినిమా వచ్చిందంటే చాలు ఇండియాలో రికార్డులన్నీ చెరిగిపోవాల్సిందే. ఆయనలా సినిమా తీసేవారు ఇండియాలోనే లేరు. అంతగా ఆయన సినిమాలకు క్రేజ్ ఉంది. ఆయనతో మూవీలు చేసేందుకు బాలవుడ్ బడా హీరోలు కూడా క్యూ కడుతున్నారు.
అలాంటి రాజమౌళి ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యారంటే దానికి కారణం ఆయన ఫ్యామిలీ సపోర్టు. రాజమౌళి రమాను ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. రాజమౌళి కంటే ముందే రమాకు ఓ మ్యూజిక్ డైరెక్టర్ తో పెండ్లి అయింది. కానీ మనస్పర్థల కారణంగా విడిపోయారు. వీరిద్దరూ విడిపోయే సమయానికే రమాకు ఓ బాబు పుట్టాడు.
అయినా సరే రాజమౌళి ఆమెను ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. కార్తీక్ ను తన సొంత కొడుకులా చూసుకుంటున్నాడు రాజమౌళి. అయితే రమాను పెండ్లి చేసుకున్న తర్వాత రాజమౌళి మరో అమ్మాయిని ప్రేమించాడంట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలిపాడు. ఓ స్టేజిపై ఆయన మాట్లాడుతూ.. నేను గతంలో ఓ అమ్మాయిని ప్రేమించాను.
రమాతో పరిచయం అయ్యాక పెండ్లి చేసుకున్నాను. ఆ అమ్మాయి వద్దకు రమాను పంపించి ఆమె ప్రేమను క్యాన్సిల్ చేయించాను అంటూ తెలిపాడు రాజమౌళి. ఈ ఒక్క విషయాన్ని బట్టి వీరిద్దరూ ఎంత అండర్ స్టాండింగ్ గా ఉంటున్నారో అర్థం చేసుకోవచ్చు.