SS Rajamouli : బిగ్ న్యూస్.. మహేశ్ సినిమాలో విలన్ గా అమీర్ ఖాన్.. రాజమౌళి భారీ ప్లాన్..!
NQ Staff - June 7, 2023 / 10:48 AM IST

SS Rajamouli : రాజమౌళి అంటే ఆ హైప్ వేరే లెవల్ లో ఉంటుంది. ఆయన తీసే సినిమాలు ఊహకు కూడా ఉందవు. ఇప్పటికే తన సినిమాలతో ప్రపంచ డైరెక్టర్లను సైతం ఆశ్చర్యపోయేలా చేశారు. అలాంటి రాజమౌళి ఇప్పుడు మహేశ్ బాబుతో తన తర్వాత సినిమాను చేయబోతున్నారు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది.
ఈ మూవీ గురించి ఏ చిన్న వార్త అయినా సరే తుఫాన్ లా మారిపోతోంది. రోజురోజుకూ అంచనాలు పీక్స్ కు వెళ్లేలా చేస్తోంది. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ రాజమౌళి మాత్రం స్పందించట్లేదు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ను విలన్ గా తీసుకుంటున్నారంట.
ఈ వార్త నెట్టింట షేక్ చేస్తోంది. సినిమాకు హాలీవుడ్ స్థాయిలో క్రేజ్ రావాలంటే అమీర్ అయితేనే సెట్ అవుతుందని రాజమౌళి భావిస్తున్నారు. అందుకే ఆయన్ను తీసుకుంటున్నారు. ఇక హాలీవుడ్ లో క్రేజ్ ఉన్న దీపికా పదుకొణెను హీరోయిన్ గా తీసుకుంటున్నారు రాజమౌళి. ఇదంతా కేవలం హాలీవుడ్ మార్కెట్ కోసమే చేస్తున్నారు.

SS Rajamouli Going Do Movie With Mahesh Babu Soon
గ్లోబల్ వైడ్ గా ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు బడా స్టార్లను తీసుకుంటే తన సినిమాకు ఆటోమేటిక్ గా మార్కెట్ వస్తుందని రాజమళి భావిస్తున్నారంట. ఇప్పటికే అమీర్ ఖాన్ తో చర్చలు జరపగా ఆయన ఓకే చెప్పినట్టు సమాచారం. దీపికా కూడా ఒప్పుకునేలా ఉందంట. ఇదే నిజమైతే మహేశ్ బాబు మూవీ ఎక్కడికో వెళ్లిపోతుంది.