SS Rajamouli Controversial Comments On Tollywood Heroes : టాలీవుడ్ లో ఆ ఒక్కడే హీరో మెటీరియల్.. రాజమౌళి వివాదాస్పద కామెంట్లు..!

NQ Staff - July 13, 2023 / 09:54 AM IST

SS Rajamouli Controversial Comments On Tollywood Heroes : టాలీవుడ్ లో ఆ ఒక్కడే హీరో మెటీరియల్.. రాజమౌళి వివాదాస్పద కామెంట్లు..!

SS Rajamouli Controversial Comments On Tollywood Heroes :

రాజమౌళి అంటే తిరుగులేని డైరెక్టర్. అపజయం అంటూ తెలియని దర్శకుడు. ఆయన సినిమా తీస్తే ఇండియన్ బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే. ఒక సినిమా ఎలా ఉంటే ప్రేక్షకులకు నచ్చుతుందో రాజమౌళికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. ఒక సీన్ ను ఎలా తీస్తే ప్రేక్షకుల మైండ్ లో నిలిచిపోతుందో.. ఆయనకంటే ఎవరూ ఊహించలేరు.

ఇక ఒక నటుడు ఎలా ఉండాలి, ఒక హీరో ఎలా ఉండాలి.. ఆ హీరోను ఎలాంటి సీన్ లో ఎలా చూపించాలో కూడా జక్కన్నకు అందరికంటే ఎక్కువగా తెలుసు. అందుకే ఆయన ఒక సీన్ తీస్తే తరతరాలు గుర్తుంచుకుంటాయి. అలాంటి జక్కన్న గతంలో ఓ సారి తెలుగు హీరోలపై చేసిన వివాదాస్పద కామెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ ఒక్కడే..

ప్రభాస్ నటించిన రెబల్ మూవీ ఆడియో లాంచ్ కు రాజమౌళి చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. అప్పుడు ఆయన మాట్లాడుతూ.. రెబల్ సినిమాలో ప్రభాస్ కటౌట్ ను చూసి మైండ్ పోయింది. ఆయన ముందు బాలీవుడ్ హృతిక్ రోషన్ కూడా ఎందుకు పనికిరాడు. అసలు టాలీవుడ్ లో హీరో మెటీరియల్ అంటే అందరికీ కేవలం ప్రభాస్ మాత్రమే గుర్తుకు వస్తాడు.

SS Rajamouli Controversial Comments On Tollywood Heroes

SS Rajamouli Controversial Comments On Tollywood Heroes

అందుకే ప్రభాస్ ను అందరూ అంతగా ఇష్టపడుతారు. ఈ సినిమాలో ప్రభాస్ కటౌట్ ను వాడుకున్న తీరు మైండ్ బ్లోయింగ్ గా ఉంది అంటూ చెప్పాడు జక్కన్న. ఆయన ప్రభాస్ ను పొగడాలనే ఉద్దేశంతోనే అలా చెప్పాడు. కానీ మిగతా హీరోలు ఎవరూ కూడా హీరో మెటీరియల్ కాదని ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు. అప్పట్లో ఈ కామెంట్లు బాగానే వివాదం లేపాయి. హీరోల ఫ్యాన్స్ జక్కన్న మీద సీరియస్ అయ్యారు కూడా. కానీ జక్కన్న మాత్రం అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. వారితో ఆయనకు ఎలాంటి వివాదాలు లేవు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us