SS Rajamouli : రాజమౌళితో తప్ప ఎవ్వడి వల్ల కాదు.. ఆదిపురుష్ చూసిన ఆడియెన్స్ రియాక్షన్..!
NQ Staff - June 17, 2023 / 11:46 AM IST

SS Rajamouli : గతంలో రామాయణం ఆధారంగా చాలా సినిమాలు వచ్చాయి. అందులో ఎక్కువగా తెలుగులోనే వచ్చాయి. తెలుగులో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు మంచి హిట్ అయ్యాయి. హావ భావాలతో పాటు.. అన్ని రకాల పాత్రలను గొప్పగా తీర్చిదిద్దారు అప్పటి దర్శకులు. అయితే ఇప్పుడు జనరేషన్ మారిపోయింది.
అందుకే ఈ జనరేషన్ కు తగ్గట్టు రామాయణం సినిమా తీస్తానని ఓం రౌత్ ఆదిపురుష్ తీశాడు. ప్రభాస్ రాముడిగా నటించాడు. నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా చాలా వరకు ఆకట్టుకోలేకపోయింది. అసలు రామాయణం పాత్రల నుంచి సరైన హావభావాలు పలికించలేకపోయారనే వాదన వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే రాజమౌళి పేరును ట్రెండింగ్ లోకి తీసుకువచ్చారు. ఈ జనరేషన్ కు తగ్గట్టు రామాయణం, మహాభారతం సినిమాలను తీయగల సత్తా కేవలం రాజమౌళికి మాత్రమే ఉందంటున్నారు ఆడియెన్స్. ఇండియాలో ఇలాంటి పురాణాల కథలను ఈ జనరేషన్ మెచ్చేలా తీయగల దమ్ము కేవలం రాజమౌళికి మాత్రమే ఉందంటున్నారు.
ఇక తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం సినిమా అని ఇప్పటికే రాజమౌళి ప్రకటించాడు. అయితే దాన్ని పది పార్టులుగా తీస్తానని కూడా ప్రకటించాడు. ప్రస్తుతం మహేశ్ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు. మహాభారతం సినిమా ఎప్పుడు ఉంటుందో చెప్పలేం. ఆ సినిమా కోసం ఇంకో పదేండ్లు అయినా పట్టేలా ఉందని అంటున్నారు రాజమౌళి ఫ్యాన్స్.