Srinidhi Shetty Demands Remuneration : అత్యాశ తో కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్
NQ Staff - July 18, 2023 / 09:40 PM IST

Srinidhi Shetty Demands Remuneration :
కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి కేజీఎఫ్ కి ముందు వరకు ఎవరికి తెలియదు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వెంటనే ఆమెకు చాలా ఆఫర్లు వచ్చాయి. కన్నడం తో పాటు తెలుగు.. తమిళం.. హిందీ లో కూడా నటించాలంటూ నిర్మాతలు కొందరు ఆమెను సంప్రదించారు. కానీ కేజీఎఫ్ 2 సినిమా విడుదల అయిన తర్వాత మాత్రమే తాను కొత్త సినిమాకు ఓకే చెప్తాను అంది.
కేజీఎఫ్ 2 సినిమా విడుదల అయిన తర్వాత ఈ అమ్మడిని ఫిల్మ్ మేకర్స్ పట్టించుకోవడం లేదు. ఒకటి రెండు ఆఫర్లు వచ్చినా కూడా నాలుగు నుండి అయిదు కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేయడం వల్ల ఈ అమ్మడికి వచ్చిన ఆఫర్లు కూడా చేజారాయి అంటూ వార్తలు వస్తున్నాయి.
తెలుగు సినిమా మిస్..
తెలుగు లో యంగ్ స్టార్ హీరోకు జోడీగా ఈమెను దర్శకుడు సంప్రదించాడట. ఆ సమయంలో కేజీఎఫ్ ప్రమోషన్స్ లో ఉండటంతో పాటు పారితోషికం చాలా అడిగిందట. డేట్లు సరైన సమయంకు ఇవ్వలేక పోవడం వల్ల ఆ తెలుగు సినిమా ను మిస్ చేసుకుంది అంటూ టాక్ వినిపిస్తుంది.
పాపం శ్రీనిధి శెట్టి కెరీర్ లో వరుసగా ఆఫర్లు వచ్చిన సమయంలో అత్యాశకు పోయి ఎక్కువ పారితోషికం డిమాండ్ చేయడంతో మొదటికే మోసం వచ్చింది. ప్రస్తుతం ఒక చిన్న కన్నడ సినిమాను చేయాల్సిన పరిస్థితి. వెయ్యి కోట్ల సినిమా లో నటించి ఇప్పుడు చిన్న సినిమా లో నటించాల్సి రావడం దురదృష్టం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.