Srinidhi Shetty : వయసైపోయిన హీరోపై మోజు పడుతున్న శ్రీనిధి శెట్టి.. డబ్బుల కోసం కక్కుర్తి..!
NQ Staff - January 30, 2023 / 12:16 PM IST

Srinidhi Shetty : ఈ నడుమ హీరోయిన్లు బాగా ముదిరిపోయారు. కేవలం డబ్బులు ఉంటే చాలు దేనికైనా రెడీ అనేస్తున్నారు. కొందరు హీరోయిన్లు డబ్బుల విషయాన్ని పక్కన పెట్టేసి మంచి కథలు, స్టార్ హీరోలను సెలెక్ట్ చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇంకొందరు హీరోయిన్లు మాత్రం డబ్బులకు కక్కుర్తి పడి ఎలాంటి నీచమైన పనికి అయినా ఓకే చెప్పేస్తున్నారు.
ఇక తాజాగా శ్రీనిధి శెట్టి కూడా ఇలాంటి నీచమైన పనే చేస్తోంది. ఆమె కేజీఎఫ్ సిరీస్ తో ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా ఆమెకు ఈ సినిమా తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇందుకు ప్రధాన కారణం ఆమె డబ్బులు ఎక్కువగా డిమాండ్ చేయడమే.
వెంకటేశ్ సినిమాలో..

Srinidhi Shetty acting opposite Venkatesh in Saindhav Movie
కేజీఎఫ్ తర్వాత ఆమెకు చాలానే ఆఫర్లు వచ్చాయి. కానీ ఆమె మాత్రం అధికంగా రెమ్యునరేషన్‌కు ఆశ పడి వచ్చిన ఛాన్సులను పోగొట్టుకుంది. ఇక తాజాగా ఆమె టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్ సినిమాలో చేస్తోంది. వాస్తవానికి పాన్ ఇండియా క్రేజ్ ఉన్న ఆమె ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ లాంటి పాన్ ఇండియా స్టార్లతో సినిమాలు చేయాలి.
కానీ డబ్బులకు కక్కుర్తి పడి సీనియర్ హీరో సినిమాకు కూడా ఓకేచెప్పేసింది. ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీనియర్ హీరోల పక్కన చేస్తే కెరీర్ క్లోజ్ అవుతుందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. కానీ ఆమె మాత్రం వినే పరిస్థితిలో లేదని తెలుస్తోంది.