Siri: సిరి త‌ల్లికి ఎలా చెప్పాలో తెలియ‌క అలా అనేసింది.. శ్రీహాన్ కామెంట్స్

Siri: బిగ్ బాస్ హౌజ్‌లో సిరి-ష‌ణ్ముఖ్ వ్య‌వ‌హారం శృతిమించుతుండ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు వారిపై మండిప‌డుతున్నారు. హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన సిరి తల్లి శ్రీదేవి.. వచ్చీ రాగానే కూతురుకు చివాట్లు పెట్టింది. ‘షణ్ముఖ్‌ను హాగ్ చేసుకోవడం నచ్చలేదని’ ముక్కుసూటిగా చెప్పింది. దగ్గరవ్వడం మంచిదే గానీ హద్దులు దాటి హగ్గులు చేసుకోవడం నచ్చడం లేదంటూ శ్రీదేవి చెప్పగా.. టాపిక్ డైవర్ట్ చేస్తూ తల్లిని సిరి పక్కకి తీసుకెళ్తుంది.

TheNewsQube-
srihan supports to siri
srihan supports to siri

శ్రీదేవి వెళ్లిపోయాక సిరి వచ్చి షణ్ముఖ్‌ను హాగ్ చేసుకుని ఏడవగా.. షణ్నూ మాత్రం ఆమెను మనసారా హత్తుకుని ఓదార్చలేకపోయాడు. నా ఆటను కూడా పక్కనబెట్టి సిరికి ఇంత సపోర్ట్ ఇస్తుంటే.. ఆమె తల్లితో మాటలు పడాల్సి వచ్చిందని బాధపడ్డాడు. హగ్గులు నచ్చడం లేదని ఆమె తల్లి చెప్పినప్పుడు సిరి ఒక్క మాట కూడా మాట్లాడలేదని.. హౌస్‌లో ఉండేందుకు తాను అర్హుడిని కాదని అనుకుంటూ కుమిలిపోయాడు.

అయితే హౌస్‌లో అందరిముందే సిరి వాళ్ల మథర్‌ అలా అనడంపై రకరకాల కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. సదరు తల్లిగా కూతురికి తప్పొప్పులు గురించి చెప్పిందంటూ కొందరు ఆమెకు సపోర్ట్‌ చేస్తుంటే, షోలో అందరి ముందు అలా అనడం కరెక్ట్‌ కాదంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై సిరి బాయ్‌ఫ్రెండ్‌, కాబోయే భర్త శ్రీహాన్‌ స్పందించాడు.

‘సిరి మథర్‌కి ఎలా చెప్పాలో తెలియక అలా అనేసింది. పాపం వాళ్లు ఉం‍టున్న వాతావరణం అలాంటిది. ఒక తల్లిగా కూతుర్ని బయట తప్పుగా అంటుంటే తీసుకోలేక అలా అనేశారు. ఆంటీ ఇలా అంటారని నేను కూడా ఊహించలేదు. దయచేసి ఆమెపై కోప్పడవద్దు.

srihan supports to siri1
srihan supports to siri1

ఆమె తరపున నేను క్షమాపణలు చెబుతున్నాను. ఇక సిరి, షణ్నూల రిలేషన్‌ను నేను గౌరవిస్తాను’ అని ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. ప్రస్తుతం శ్రీహాన్‌ చేసిన ఈ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.